|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Vishnu : రావణుడిగా మా నాన్న.. రాముడిగా.. రామాయణం తీయబోతున్న విష్ణు..? కానీ ‘రావణ’ కథతో..

Published: 19-07-2025, 12:16 PM
Manchu Vishnu : రావణుడిగా మా నాన్న.. రాముడిగా.. రామాయణం తీయబోతున్న విష్ణు..? కానీ ‘రావణ’ కథతో..

మంచు విష్ణు తాజాగా రామాయణం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించాలని ప్రకటించాడు. కానీ ఆయన తీయబోయేది రాముడి కథ కాదు, రావణుడి కథ. తన తండ్రి మోహన్ బాబు రావణుడిగా నటించాలని ఆయన కోరుకుంటున్నాడు.

Key Points

1

మంచు విష్ణు రావణుడి కథ ఆధారంగా రామాయణం సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు.

2

మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు రావణుడి పాత్రలో నటించాలని ఆయన కోరుకుంటున్నారు.

4

ఈ ప్రాజెక్ట్‌కు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాలని విష్ణు ఆశిస్తున్నాడు.

విష్ణు యొక్క రామాయణం విశేషాలు

Manchu Vishnu : మంచు విష్ణు ఇటీవలే కన్నప్ప సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. కన్నప్ప తర్వాత తన దగ్గరున్న కథలనే సినిమాలుగా చేస్తానని తెలిపాడు. అయితే కన్నప్ప ప్రమోషన్స్ లో విష్ణు రామాయణం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇటీవల చాలామంది దర్శక నిర్మాతలు రామాయణ, మహాభారతాల మీదే సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు. త్వరలో బాలీవుడ్ నుంచి ఒక రామాయణం రానుంది.

అయితే మంచు విష్ణు రామాయణం సినిమాని తీయాలని ప్లాన్ చేసాడట. కాకపోతే రావణుడి కథగా తీద్దామనుకున్నాడట. ఇంటర్వ్యూలో మంచు విష్ణు తాను తీయాలన్న రామాయణం గురించి, అందులో ఎవరెవరు ఏ పాత్ర వేయాలి అనుకుంటున్నాడో చెప్పుకొచ్చాడు.

నటీనటుల ఎంపిక

మంచు విష్ణు మాట్లాడుతూ.. రావణుడి మీద ఒక స్క్రిప్ట్ ఉంది. రావణుడు పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేంతవరకు ఉంటుంది అందులో. రావణ స్క్రిప్ట్ ని తీసుకొని సూర్యని 2009 లోనే కలిసాను అందులో రాముడి పాత్ర వేయమని. బడ్జెట్ వర్కౌట్ అవ్వక ఆ సినిమా అవ్వలేదు. ఆ సినిమాని డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేయాలి. మా నాన్న రావణుడి పాత్ర చేయాలి. డైలాగ్స్ కూడా రాసేసాం. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అందులో నేను హనుమంతుడి పాత్ర చేయాలి అనుకున్నాను. కానీ రాఘవేంద్రరావు గారు నన్ను హనుమంతుడు చేయొద్దు, ఇంద్రజిత్ పాత్ర చేయమన్నారు. నేను కార్తీని ఇంద్రజిత్ పాత్రకు అనుకున్నాను. ఇప్పుడు చేస్తే వాళ్ళతోనే చేస్తాను. రాముడిగా సూర్య, సీతగా అలియా భట్, రావణుడిగా మా నాన్న, కళ్యాణ్ రామ్ లక్ష్మణుడు పాత్రలో, జటాయువుగా సత్యరాజ్ ని తీసుకుంటాను అని అన్నారు. మరి విష్ణు నిజంగానే రావణ సినిమా తీస్తాడా చూడాలి.

సినిమా ప్రాజెక్ట్‌పై అప్‌డేట్

మంచు విష్ణు యొక్క ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది. రావణుడి కథకు కొత్త కోణాన్ని ఇవ్వడంలో విష్ణు విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.