|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కల్యాణ్‌కు కన్నప్ప సినిమా చూపిస్తా.. మంచు విష్ణు ఆసక్తికర ప్రకటన

Published: 26-06-2025, 10:47 AM
పవన్ కల్యాణ్‌కు కన్నప్ప సినిమా చూపిస్తా.. మంచు విష్ణు ఆసక్తికర ప్రకటన

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో, పవన్ కల్యాణ్ కు సినిమా చూపించాలని విష్ణు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. సినిమా గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా రేపు విడుదల

2

పవన్ కల్యాణ్ కు వ్యక్తిగతంగా సినిమా చూపిస్తానని మంచు విష్ణు ప్రకటన

4

మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు

కన్నప్ప సినిమా విడుదల తేదీ

మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా(Kannappa Movie) రేపు ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు కన్నప్ప సినిమా ఎప్పుడు చూపిస్తారని అడిగారు. దీనికి మంచు విష్ణు స్పందిస్తూ.. ‘విడుదలైన వెంటనే ఆయన సమయం తీసుకుని వ్యక్తిగతంగా కలిసి సినిమా చూపిస్తా.. మనకు తెలిసిన పవన్‌ కల్యాణ్‌ వేరు. ఈరోజు ఆయన దేవుడు. ఆయనపై రాష్ట్ర బాధ్యత ఉంది. తప్పకుండా ఆయన సమయం తీసుకుని సినిమా చూపించాలి. నటుడిగా ఆయన నాకు సీనియర్‌. ఆయన ప్రశంసలు వస్తాయా? రావా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని విష్ణు చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషితో పాటు మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు స్వయంగా మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వీడియో

మంచు విష్ణు ప్రకటన

సినిమా విశేషాలు

మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాపై ఆశలు పెంచుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. సినిమా విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.