|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంచు విష్ణు సడన్ బ్లాస్ట్: న్యూ ఇయర్‌కు భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన హీరో!

Published: 01-01-2026, 8:00 AM
మంచు విష్ణు సడన్ బ్లాస్ట్: న్యూ ఇయర్‌కు భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన హీరో!
  • నూతన సంవత్సరంలో మంచు విష్ణు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
  • “10 నిమిషాల షార్ట్ ఫిలిం టు 10 కోట్ల ఫ్యూచర్ ఫిలిం” అంటూ ఆసక్తికర హింట్ ఇచ్చారు.
  • ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 15న వెల్లడికానున్నాయి.
  • గత ఏడాది ‘కన్నప్ప’తో విజయం అందుకున్న తర్వాత విష్ణు చేస్తున్న ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

నూతన సంవత్సరంలో మంచు విష్ణు తన అభిమానులకు అదిరిపోయే వార్తను అందించారు. తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి ఆసక్తిని రేపారు. కన్నప్ప తర్వాత విష్ణు చేస్తున్న ఈ ప్రకటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జనవరి 15న దీనిపై మరింత స్పష్టత రానుంది.

మంచు విష్ణు కెరీర్, కన్నప్ప విజయం

Manchu Vishnu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న కుటుంబాలలో మంచు కుటుంబం కూడా ఒకటి . కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక మోహన్ బాబు వారసులుగా ఆయన పిల్లలు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే విష్ణు ,మనోజ్, లక్ష్మి అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇక గత ఏడాది మంచు హీరోలు మంచి సక్సెస్ సినిమాలను అందుకున్నారనే చెప్పాలి. మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక మంచు విష్ణు విషయానికొస్తే ఈయన కూడా గత ఏడాది కన్నప్ప(Kannappa) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తన డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప సినిమాని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా గత ఏడాది జూన్ నెలలో విడుదలైంది అయితే ఇప్పటివరకు విష్ణు తన తదుపరి సినిమాని ఎక్కడ ప్రకటించలేదు అయితే రామాయణం సినిమా చేయాలని భావిస్తున్నట్లు గతంలో ఒక సందర్భంలో వెల్లడించారు కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలబడలేదు.

ఇకపోతే నేడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రిటీలు వారి సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ తెలియజేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు సైతం తన తదుపరి సినిమాకి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేయడమే కాకుండా.. న్యూ ఇయర్, న్యూ ఎనర్జీ, బిగ్ థింగ్స్ స్టార్ట్ స్మాల్.. 10 మినిట్స్ షార్ట్ ఫిలిమ్ టూ 10 కోట్ల ఫ్యూచర్ ఫిలిం అంటూ ఈయన తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన చేయడమే కాకుండా జనవరి 15వ తేదీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించబోతున్నట్లు తెలిపారు.

న్యూ ఇయర్ స్పెషల్: కొత్త ప్రాజెక్ట్ ప్రకటన

New year. New energy. Big things start small. 10 mins to 10 crore. More soon. 🎬 #HarHarMahadev pic.twitter.com/XfvmLXUQeg

— Vishnu Manchu (@iVishnuManchu) January 1, 2026

జనవరి 15న పూర్తి వివరాలు: ఆసక్తిగా అభిమానులు

ఈ విధంగా మంచు విష్ణు తన తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటన తెలియజేయడంతో తదుపరి ఏం చేయబోతున్నారనే విషయంపై ఎంతోమంది సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా ఈ పోస్టుపై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి విష్ణు ఎలాంటి ప్రకటన తెలియజేయబోతున్నారో తెలియాలి అంటే 15వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఇక విష్ణు హీరోగా తన సొంత నిర్మాణ సంస్థలోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలతో పాటు వ్యాపారాలను యూనివర్సిటీ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

మంచు విష్ణు చేసిన ఈ ప్రకటన అభిమానుల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపింది. ‘కన్నప్ప’ తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్ ఏమై ఉంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు. జనవరి 15న రానున్న పూర్తి వివరాల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.