|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంగ్లీ వివాదం: పంజాగుట్ట సీఐ సంచలన ప్రకటన! అసలేం జరిగింది?

Published: 13-04-2026, 9:35 AM
మంగ్లీ వివాదం: పంజాగుట్ట సీఐ సంచలన ప్రకటన! అసలేం జరిగింది?
  • మంగ్లీపై పెట్టుబడుల పేరుతో మోసం చేసిందంటూ ఆరోపణలు, కేసు నమోదు
  • ఫైనాన్స్ క్యాంపు పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ రామకృష్ణ ప్రకటన
  • మంగ్లీ తనను బెదిరించిందని అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు
  • సుబ్బారావుకు ఆల్కహాల్ టెస్ట్ చేసిన పోలీసులు

ప్రముఖ సింగర్ మంగ్లీ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా పెట్టుబడుల పేరుతో మోసం చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై పంజాగుట్ట సీఐ స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

మంగ్లీ వివాదంపై పంజాగుట్ట సీఐ స్పందన

Mangli: జానపద గేయాలతో అందరి హృదయాలను దోచుకున్న మంగ్లీ (Mangli ) ఆ తర్వాత కాలంలో సినిమా పాటలు పాడుతూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా శివరాత్రి వస్తే చాలు ఆ శివుడినే మైమరిపించేలా తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించే ఈమె.. గత కొంతకాలంగా తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో తన బర్తడే పార్టీ అని చెప్పి కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో.. స్థానికులు డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈమెపై ఆరోపణలు చేశారు.. ఇప్పుడు పెట్టుబడుల పేరుతో ఈమె వంద మందిని పైగా మోసం చేసింది అంటూ మరో ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె అంగీకరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు సుబ్బారావు అనే ఒక న్యాయవాది. ఇక అతడు ఇచ్చిన ఫిర్యాదుతో మంగ్లీపై కేసు నమోదు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది మంగ్లీ. అయితే ఇప్పుడు ఈ వివాదంపై పంజాగుట్ట సిఐ స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు.

150 కోట్ల భారీ స్కామ్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ, లాయర్ సుబ్బారావు మధ్య నడుస్తున్న వివాదం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వేదికగా కొత్త మలుపులు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ కేసు పై వస్తున్న వార్తల నేపథ్యంలో పంజాగుట్ట సిఐ రామకృష్ణ స్పందించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. పంజాగుట్ట సీఐ రామకృష్ణ ఈ వివాదానికి మూలం అని భావిస్తున్న ఫైనాన్స్ స్కామ్ పై స్పందించారు .

ఫైనాన్స్ స్కామ్ పై పోలీసుల ప్రకటన

సిఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ” ఇప్పటివరకు మాకు ఫైనాన్స్ క్యాంపు కి సంబంధించిన ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదు. బాధితులుగా చెప్పుకుంటున్న వారెవరు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి రారు” అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక సింగర్ మంగ్లీ తనను బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే ఆదివారం రోజు సింగర్ మంగ్లీ కూడా అడ్వకేట్ సుబ్బారావు పై తిరిగి ఫిర్యాదు చేశారు. ఇక నేడు అడ్వకేట్ సుబ్బారావు కొంతమంది బాధితులతో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చారు.

అదే సమయంలో ఆయన దగ్గర నుంచి ఆల్కహాల్ వాసన రావడాన్ని గమనించిన సీఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా తక్షణమే ఆయనకు ఆల్కహాల్ టెస్ట్ చేయాలని ఆదేశించారు. ఇక పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్టులో సుబ్బారావుకి 27 ఎంజి ఆల్కహాల్ శాతం నమోదైనట్లు తెలిపారు. సీఐ మాట్లాడుతూ ఆల్కహాల్ టెస్ట్ చేస్తున్న సమయంలో సుబ్బారావు మీడియా సమక్షంలో హంగామా సృష్టించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారు . ప్రస్తుతం రెండు వైపులా ఫిర్యాదులను పరిశీలిస్తున్నాము. దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుంది. అంటూ స్పష్టం చేశారు అయితే ఈ విషయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. మరి నిజా నిజాలు తెలియాలి అంటే పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుందో తెలిసే వరకు ఎదురు చూడాల్సిందే.

సుబ్బారావుపై ఆల్కహాల్ టెస్ట్

మొత్తానికి మంగ్లీ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఈ కేసును ఏ విధంగా దర్యాప్తు చేస్తారో చూడాలి. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.