|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మురళీ నాయక్‌పై ‘మంగ్లీ’ పాట.. కన్నీళ్లు తెప్పించే వీడియో

Published: 16-05-2025, 2:21 AM
మురళీ నాయక్‌పై 'మంగ్లీ' పాట.. కన్నీళ్లు తెప్పించే వీడియో

ఆపరేషన్ సిందూర్లో ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్‌ను గుర్తు చేసుకుంటూ గాయని మంగ్లీ ఒక హృద్యమైన పాటను పాడింది. ఈ పాట మురళీనాయక్ జ్ఞాపకాలను, తల్లిదండ్రుల దుఃఖాన్ని ప్రతిబింబిస్తుంది.

Key Points

1

మంగ్లీ పాటతో మురళీనాయక్ ధైర్యాన్ని, త్యాగాన్ని కొనియాడారు.

2

ఆపరేషన్ సిందూర్ వీరుడు మురళీనాయక్ జ్ఞాపకార్థం పాట.

4

కన్నీళ్లు పెట్టించే పాట నెటిజన్లను కదిలించింది.

మంగ్లీ గీతం: ఒక త్యాగం కథ

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో మీరమరణం పొందిన మన తెలుగుబిడ్డ మురళీనాయక్‌పై సింగర్‌ మంగ్లీ ఒక పాట పాడారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో మంగ్లీ తెలిపారు. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించేలా ఆ సాంగ్‌ ఉందంటూ నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా  గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేలకొరిగాడు.

ఈ వార్తతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. వారికి అండగా రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు నిలిచారు. ఈ క్రమంలో మురళీ నాయక్‌ తల్లిదండ్రులను మంగ్లీ కూడా కలిసి ఓదార్చారు.  దేశంలోని మహిళల సిందూరం కాపాడేందుకు  తన ప్రాణాలను అర్పించాడని ఆమె కొనియాడారు. దేశంలోని ప్రతి మహిళ సిందూరంలో మురళీనాయక్‌ నిలిచి ఉంటాడని మంగ్లీ భావోద్వగభరితంగా చెప్పారు. ఇప్పుడు తాజాగా తన పాట రూపంలో ప్రపంచానికి తెలిపారు.

మురళీనాయక్‌కు నివాళి

నెటిజన్ల స్పందన

మురళీనాయక్ త్యాగం దేశానికి స్ఫూర్తి. మంగ్లీ పాట ఆయన ధైర్యాన్ని, దేశభక్తిని మరోసారి చాటుతుంది. ఈ పాట అందరి హృదయాలను తాకింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.