|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మరణానంతరం ఏం జరుగుతుంది? పిండ ప్రదానాలు ఎందుకు?

Published: 24-05-2025, 4:24 AM
మరణానంతరం ఏం జరుగుతుంది? పిండ ప్రదానాలు ఎందుకు?

మరణానంతరం ఏమి జరుగుతుంది? పిండ ప్రదానాలు ఎందుకు చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం పిండోపనిషత్తును అధ్యయనం చేద్దాం. పంచభూతాలు, కారణ శరీరం, యాతనా శరీరం గురించి తెలుసుకుందాం.

పంచభూతాల విడిపోవడం

మరణం తరువాత ఏం జరుగుతుంది? అసలు పిండ ప్రదానాలు ఎందుకు? ఈ అంశాలను స్పష్టంగా వివరించేదే ‘పిండోపనిషత్తు’. ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.

అధర్వణ వేద శాఖకు చెందిన ఉపనిషత్ పిండోపనిషత్తు. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్య, నైమిత్తిక, కామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. మరణం తరువాత అంశాన్ని మాత్రం మనం తెలుసుకుంటే, పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలు విడిపోవడమే మరణం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచభూతాలు వచ్చినట్టే వెళ్లిపోతాయి

శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహా భూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళ్ళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవో అలానే వెళ్లిపోతాయి. దీనిని ఆధునిక వైద్యశాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు.

కారణ శరీరం మరియు యాతనా శరీరం

ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం), దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది, శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళ్ళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది.

ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో, భూతతత్త్వం అయిన ధాతువులు, ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మరణం తరువాత శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే.. ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం అని చిలకమర్తి తెలిపారు. మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటు ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అనే రెండూ ఉంటాయి.

కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాప పుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్ళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దారిన అవి వెళ్ళిపోతే, చివరకు మృతుని ప్రేత మాత్రం మిగిలి ఉంటుంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పిండ ప్రదానాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

పిండ ప్రదానాలు ఎందుకు చేయాలో తెలుసా?

ప్రతీ మానవుడు ధర్మ మార్గంలో నడుస్తూ కర్మను ఆచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందాలి. అయితే, కర్మలను ఆచరించే విధానంలో అందరూ జ్ఞానము ద్వారా మోక్షము పొందలేని స్థితి ఏర్పాటు చేత కర్మలో పితృ దేవతలను తృప్తి పరిచి, పిండ ప్రదానాలు ఆచరించడం చేత పితృ దేవతల అనుగ్రహం పొంది నిత్య జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు అని చిలకమర్తి తెలిపారు.

పితృ దేవతలకు పిండ ప్రదానాలు ఆచరిస్తే ఆయుష్షు, ఆరోగ్యము మరియు ఐశ్వర్యము కలుగుతుందని, ఇహలోకంలో భోగ భాగ్యములు కలుగుతాయని చిలకమర్తి తెలిపేరు. ప్రతీ మానవుడు దేవతలను పూజించడం ఎంత ముఖ్యమో పితృ దేవతులకు పిండ ప్రదానం చేయడం, వారు గతించిన తిధి నాడు పిండ ప్రదానం చేయడం వలన కొన్ని రెట్లు శుభ ఫలితాలను పొందవచ్చు అని చిలకమర్తి తెలిపారు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000

మోక్షం పొందాలంటే ధర్మమార్గంలో నడవాలి. కర్మలను ఆచరించి, జ్ఞానాన్ని సంపాదించుకోవడం చాలా ముఖ్యం. పిండ ప్రదానాలు మృతులకు శాంతినిచ్చేవి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.