
లెజెండరీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ‘మరీ అంతగా’ పాట, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ పాటలోని జీవిత సత్యాలు, భావోద్వేగాలు మనల్ని ఆకట్టుకుంటాయి.
Key Points
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన అద్భుతమైన పాట.
జీవితంలోని నిజాలను ప్రతిబింబించే సాహిత్యం.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలోని హిట్ పాట.
మహేష్ బాబు, వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమా పాట.
మరీ అంతగా పాట లిరిక్స్
లెజెండరీ రైటర్ సిరివెన్నల సీతారామ శాస్త్రి రాసిన పాటలు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. జీవిత సత్యాలను తెలిపేవి కొన్నయితే.. స్ఫూర్తి రగిలించేవి మరికొన్ని. అలాంటి పాటే ఇదే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలోని ‘మరీ అంతగా’ సాంగ్. నిజాలను చెప్పే ఈ సాంగ్ లిరిక్స్ మీకోసం.
2013లో వచ్చిన మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ సూపర్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వెంకటేష్, మహేష్ బాబు బ్రదర్స్ గా యాక్ట్ చేశారు. ఇక రేలంగి మామయ్యగా ప్రకాశ్ రాజ్ ఐకానిక్ క్యారెక్టర్ ప్లే చేశారు. సమంత, అంజలి ఫీమేల్ లీడ్ గా నటించారు.
మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. ఇక సిరివెన్నెల రాసిన మరీ అంతగా సాంగ్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటోంది.
మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకల
పనేం తోచక పరేషానుగ గడబిడ పడకు అల
మతోయెంతగ శ్రుతే పెంచక విచారాల విల విల
సరే చాలిక అలా జాలిగ తిక మక పెడితే ఎల
కన్నీరై కురవాల మన చుట్టు ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాల నిను చూడాలంటే అద్దం జడిసేలా
సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం
ఎక్కిళ్లె పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఎదో లాభం వస్తుందా వృథా ప్రయాస పడాలా
మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా
సరే చాలిక అలా జాలిగ తిక మక పెడితే ఎలా
ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినెటో తరిమేస్తామా చీ పొమ్మని
కస్సుమని కలహిస్తామ ఉస్సురని విలపిస్తామ రోజులతో రాజీ పడమ సర్లేమ్మని
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచి పడుతు ఎం సాధిస్తామంటే ఎం చెబుతాం
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఎదో లాభం వస్తుందా వృథా ప్రయాస పడాలా
చెమటలేం చిందించాల శ్రమపడేం పండించాల
పెదవిపై చిగురించేల చిరునవ్వులు
కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాల సుఖశాంతులు
వందెళ్ళయిన వాడని చిరునవ్వు
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఎదో లాభం వస్తుందా వృథా ప్రయాస పడాలా
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం, సంగీతం, మరియు సినిమా కలయిక ఈ పాటను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ పాట జీవితంలోని నిజాలను గుర్తుచేస్తుంది.


