
📌 Key Points
- విజయ్ పార్టీకి ఓటేయొద్దంటూ బిగ్ బాస్ భామ మరియా జులియానా ధర్నా!
- చెన్నై మెరీనా బీచ్‌లో ఫలకార్డులతో నిరసన తెలిపిన జులియానా, ఉద్రిక్తత!
- విజయ్‌ను ఉడతతో పోల్చిన జులియానా, మహిళలకు రక్షణ లేదని ఆరోపణ!
- మరియా జులియానాను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హెచ్చరిక జారీ!
తమిళ రాజకీయాల్లో సంచలనం! విజయ్‌కి వ్యతిరేకంగా బిగ్ బాస్ ఫేమ్ మరియా జులియానా ధర్నా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎందుకు అలా చేసింది? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
విజయ్‌పై బిగ్ బాస్ భామ సంచలన ఆరోపణలు
Maria Juliana : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరుగనున్నాయి. DMK కూటమి, NDA కూటమితో పాటు ఈ సారి తమిళ్ స్టార్ హీరో విజయ్ తన TVK పార్టీ తరపున అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడు. తమిళనాడులో హోరాహోరీ పోటీ జరగనుంది. అయితే తమిళనాడు ఎన్నికల హడావిడి మొదలయిన దగ్గర్నుంచి విజయ్ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు.
తాజాగా ఓ నటి విజయ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలిచింది. మరియా జులియానా అనే తమిళ నటి పలు సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. తమిళ్ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. మరియా జులియానా DMK లో చేరి గతంలోనే పార్టీ కార్యకర్తగా ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు విజయ్ కి, TVK పార్టీ కి ఓటు వేయొద్దు అంటూ ప్రచారం చేస్తుంది.
మెరీనా బీచ్‌లో మరియా జులియానా ధర్నా
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో విజయ్ గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్న మరియా జులియానా ఇటీవల చెన్నై మెరీనా బీచ్ వద్ద రెండు ఫలకార్డులు పట్టుకొని ధర్నా చేసింది. తన మద్దతుదారులతో కలిసి సడెన్ గా ప్రత్యక్షమయి ఈ ధర్నా నిర్వహించింది. విజయ్ ఉడత లాంటి వాడు, TVK పార్టీలో మహిళలకు రక్షణ లేదు అందుకే విజయ్ కి ఓటేయొద్దు, DMK కి ఓటు వేయండి అంటూ ఆ ఫ్లకార్డుల మీద రాసుకొచ్చింది.
అయితే విజయ్ ఫ్యాన్స్ మరియా జులియానాపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఇకపై పర్మిషన్ లేకుండా ఇలాంటివి చేయొద్దు అంటూ హెచ్చరించి మరియా జులియానాని వదిలేసారు పోలీసులు. అయితే పర్మిషన్ అడిగినా ఇవ్వలేదు అని మరియా జులియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పోలీసుల అదుపులో బిగ్ బాస్ ఫేమ్
మొత్తానికి బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న భామ మరియా జులియానా ఇప్పుడు ఎన్నికల సమయంలో విజయ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, విజయ్ పై రెగ్యులర్ గా నెగిటివ్ పోస్టులు పెడుతూ మరింత వైరల్ అవుతుంది.
మొత్తానికి మరియా జులియానా వ్యవహారం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


