|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఒక్క ఆర్టిస్ట్ కూడా సపోర్ట్ చేయలేదు! బాత్రూంలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న రీతూ చౌదరి!!

Published: 18-01-2026, 4:30 AM
షాకింగ్: ఒక్క ఆర్టిస్ట్ కూడా సపోర్ట్ చేయలేదు! బాత్రూంలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న రీతూ చౌదరి!!
  • బిగ్ బాస్ 9 నుండి బయటకి వచ్చాక BB జోడి డ్యాన్స్ షోలో రీతూ చౌదరి!
  • తండ్రి మరణం తర్వాత కుటుంబం కష్టాలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రీతూ!
  • బిగ్ బాస్ లో నెగిటివ్ ప్రచారం చేశారని కన్నీళ్లు పెట్టుకున్న రీతూ చౌదరి.
  • సపోర్ట్ చేయని ఆర్టిస్టులు, బాగాలేదని కామెంట్స్ చేసిన చుట్టాలని తెలిపిన రీతూ చౌదరి!

బుల్లితెర ఫేమ్ రీతూ చౌదరి గురించి ఒక సంచలన వార్త! బిగ్ బాస్ షోలో ఆమె ఎదుర్కొన్న అనుభవాల గురించి ఎమోషనల్ గా మాట్లాడింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

బిగ్ బాస్ తర్వాత రీతూ లైఫ్ ఎలా ఉంది?

Rithu Chowdary : సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న రీతూ చౌదరి ఆ తర్వాత టీవీ షోలతో మరింత వైరల్ అయింది. ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొని ఆల్మోస్ట్ చివరి వరకు ఉండి 90 రోజుల తర్వాత బయటకు వచ్ఛేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక రీతూ చౌదరి ప్రస్తుతం BB జోడి డ్యాన్స్ షోతో పాటు పలు టీవీ షోలు చేస్తుంది. అలాగే బయట యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తుంది.(Rithu Chowdary)

తాజాగా రీతూ చౌదరి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనని బయట నెగిటివ్ చేసారని చెప్తూ ఎమోషనల్ అయింది. రీతూ చౌదరి తండ్రి రెండేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయింది.

నెగిటివ్ కామెంట్స్ పై రీతూ ఎమోషనల్ కామెంట్స్!

రీతూ చౌదరి మాట్లాడుతూ.. నేను, మా అమ్మ, మా అన్నయ్య అంతే ముగ్గురమే ఉంటాం. బాధ అయినా సంతోషం అయినా మా ముగ్గురి మధ్యే. మా నాన్న వెళ్ళిపోయాక చాలా బాధపడ్డాం. మాకు చుట్టాలు కూడా ఎక్కువ లేరు. నేను ఇల్లు కొన్నాక మా ఇంటికి అసలు ఓ పదిమంది కూడా రాలేదు మా చుట్టాలు. మా అమ్మ బాధలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోడానికి ఎవరూ ఉండరు. బిగ్ బాస్ లో నా గురించి మా అమ్మ చాలా ఫీల్ అయింది. నా గురించి బయట నెగిటివ్ చేసారు. నేను బయటకు వచ్చేస్తే బాగుండు అనుకుంది మా అమ్మ.

రీతూకి సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరా?

చాలా మంది ఆర్టిస్టులకు మా అమ్మ ఫోన్ చేసి ఓటింగ్ గురించి వీడియో చేయమని అంటే చేయలేదు. చేయమన్నారు. ఆర్టిస్టులు చాలా మంది నాకు సపోర్ట్ చేయలేదు. నా క్యారెక్టర్ నెగిటివ్, బ్యాడ్ అని అన్నారు. ఆ విషయంలో మా అమ్మ చాలా బాధపడింది. బిగ్ బాస్ నుంచి అందరూ బయటకు వచ్చాక వాళ్లకు ఫోన్ కాల్స్ వస్తే మాకు మాత్రం ఎవరూ లేరు మాట్లాడటానికి. మా అమ్మ ఇవన్నీ చూసి బాధపడితే నేను మా అమ్మని ఓదార్చి నేను వెళ్లి బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. మా చుట్టాలు కొంతమంది మాకు ఇలాగే జరగాలి, వీళ్ళకి బాగా జరిగింది అని నెగిటివ్ గా కామెంట్స్ చేసారు అని చెప్తూ ఎమోషనల్ అయింది.

రీతూ చౌదరి తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఆమె ధైర్యంగా వాటిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.