|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mario : ‘మారియో’ అంటున్న హెబ్బా పటేల్.. థ్రిల్లర్ సినిమాతో..

Published: 03-10-2025, 11:16 AM
Mario : ‘మారియో’ అంటున్న హెబ్బా పటేల్.. థ్రిల్లర్ సినిమాతో..

అనిరుధ్, హెబ్బా పటేల్ జంటగా రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం ‘మారియో’. కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. రైఫిల్ పట్టుకున్న అనిరుధ్, స్టైలిష్ హెబ్బా పటేల్‌తో కూడిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇది థ్రిల్లర్ మూవీ అని ట్యాగ్‌లైన్‌తో స్పష్టమవుతోంది.

Key Points

1

అనిరుధ్, హెబ్బా పటేల్ జంటగా 'మారియో' చిత్రం రూపొందుతుంది.

2

కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ఇది.

4

'ఎ టర్బో- ఛార్జ్‌డ్ ర్యాంప్ రైడ్' ట్యాగ్‌లైన్‌తో ఆసక్తి రేపుతున్న చిత్రం.

‘మారియో’ ఫస్ట్ లుక్ విడుదల

Mario : అనిరుధ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మారియో. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలుగా నాటకం, తీస్ మార్ ఖాన్ సినిమాల ఫేమ్ కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా దసరా సందర్భంగా ‘మారియో’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ‘ఎ టర్బో- ఛార్జ్‌డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌ ఈ సినిమా టైటిల్ కి ఇచ్చారు. ఫస్ట్ లుక్‌లో అనిరుధ్, హెబ్బా పటేల్ స్టైలిష్ గా కనిపిస్తూ అనిరుధ్ రైఫిల్ పట్టుకుని, బ్యాక్ గ్రౌండ్ లో కారు, చీకటి, వర్షం సెటప్ తో ఇదొక థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది.

సినిమాలో కీలక పాత్రలు, సాంకేతిక బృందం

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

థ్రిల్లర్ కథాంశంతో ‘మారియో’

Also See : Kiran Abbavaram : ఫ్రెండ్ పెళ్ళిలో భార్య, కొడుకుతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం.. క్యూట్ ఫొటోలు వైరల్..

‘మారియో’ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను సృష్టించింది. ఒక వైపు బలమైన కథ, మరోవైపు స్టార్ క్యాస్ట్‌తో ఈ థ్రిల్లర్ చిత్రం త్వరలో విడుదల కానుంది. చిత్ర బృందం మరిన్ని అప్‌డేట్‌లను త్వరలో విడుదల చేయనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.