|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. ‘రాజాసాబ్’లో మారుతి ఊహించని ట్విస్ట్!

Published: 10-01-2026, 5:00 AM
ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. 'రాజాసాబ్'లో మారుతి ఊహించని ట్విస్ట్!
  • ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీలో తొలగించిన సీన్స్ తిరిగి జతచేస్తున్న మారుతి!
  • సాయంత్రం 6 గంటల నుండి థియేటర్లలో రాజాసాబ్ కొత్త ఎపిసోడ్స్!
  • డార్లింగ్ ఫ్యాన్స్ కోసం 8 నిమిషాల యాక్షన్ సీన్స్ జత!
  • సినిమాలో లెంగ్తీ సీన్స్ తొలగింపు, షార్ట్ చేసి కొత్త వెర్షన్ విడుదల!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘ది రాజాసాబ్’ మూవీలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఫ్యాన్స్ కోరిక మేరకు మారుతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం!

ఫ్యాన్స్ డిమాండ్.. మారిన రాజాసాబ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(maruthi) కాంబోలో వచ్చిన భారీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’(The Rajasaab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించగా.. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చింది. ఇందులో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు భామలు మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జనవరి 9న థియేటర్స్‌లోకి వచ్చి.. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. మరీ ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించని పలు సీన్స్ తొలగించి మూవీ మేకర్స్ మోసం చేశారని ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మారుతిని దారుణంగా తిడుతున్నారు. విడుదలకు ముందు హైప్ ఇచ్చావు కానీ.. అసలు అందులో అంత మ్యాటర్ ఏం లేదని కథ కూడా బోరింగ్‌గా ఉందని పలు విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, మారుతి ఈ విషయంపై స్పందించి డార్లింగ్ అభిమానుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

థియేటర్లలో అదనపు యాక్షన్ సీన్స్!

‘‘ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది డిసపాంట్ అవ్వలేదు.. అలా అని మా సినిమాకు సాటిస్ఫై కూడా కాలేదు. ఎందుకంటే.. మేము ట్రైలర్‌లో ప్రభాస్‌ను ఓల్డ్ గెటప్‌లో రాక్షసుడిలా చూపించాము. ఆయన అటిట్యూడ్, స్వాగ్ అన్నింటితో పరిచయం చేశాం. కానీ థియేటర్లలో మాత్రం ఆయన ఎక్కడున్నారనే వెతుకునే ప్రాసెస్‌లో మేము చూపించిన కథను బ్రేయిన్‌కి ఎక్కించుకోలేకపోయారు. అందుకని నిన్న సాయంత్రం ప్రభాస్ అభిమానులు చాలామంది వచ్చి నాతో మాట్లాడారు. సినిమా బాగా తీసావ్ కానీ.. అసలైన సీన్స్ తొలగించారని బాధపడ్డారు. అవి కనుక జత చేస్తే చాలా సంతోషిస్తామని అన్నారు. అందుకే వారి కోరిక మేరకు ఓల్డ్ గెటప్‌లో ఉన్న సీన్స్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటల షో నుంచి యాడ్ చేయబోతున్నాము.

లెంగ్తీ సీన్స్‌కు కత్తెర!

కచ్చితంగా ఆ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ ఉంది. ఎందుకంటే చాలా కష్టపడి.. డబ్బులు పెట్టి తెరకెక్కించాం. రూఫ్‌లో ఫైట్ జరగడం అంటే ఇంత వరకు ఎక్కడా ఎప్పుడూ రాలేదు. ఇదంతా ఒక 8 నిమిషాల పాటు ఉంటుంది. కచ్చితంగా ఆయన స్వాగ్‌ను అభిమానులంతా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే ఎక్కడైతే లెంతీగా ఉందని అంటున్నారో.. వాటిని కూడా షార్ట్ చేసి పెట్టాలని నిర్ణయించుకున్నాం. కొత్త ప్రభాస్ గారిని రియల్ ‘రాజాసాబ్’ని ఈ రోజు సాయంత్రం నుంచి థియేటర్స్‌లో చూస్తారు. ఇప్పటికే సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన డార్లింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చూసిన వారే మళ్లీ రెండోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మారుతి తీసుకున్న ఈ నిర్ణయం ప్రభాస్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. రాజాసాబ్ మూవీ మరింత విజయం సాధిస్తుందని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.