|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Maruthi: సాహో, కల్కిలో డిసప్పాయింట్‌.. ప్రభాస్‌కు ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు

Published: 16-06-2025, 4:58 AM
Maruthi: సాహో, కల్కిలో డిసప్పాయింట్‌.. ప్రభాస్‌కు ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు

డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న విడుదలవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హారర్ జానర్ లో ఉంటుంది. ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లను కోరడంతో ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు.

Key Points

1

ప్రభాస్ హారర్ మూవీ 'రాజా సాబ్' డిసెంబర్ 5న విడుదలవుతోంది.

2

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు.

4

సాహో, కల్కి చిత్రాల తర్వాత ప్రభాస్‌కు మరో హారర్‌ చిత్రం.

రాజా సాబ్ చిత్ర విడుదల తేదీ

లవ్‌, యాక్షన్‌, ఫాంటసీ, మైథాలజీ.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు డార్లింగ్‌ ప్రభాస్‌ ( Prabhas ). అయితే హారర్‌ జానర్‌ను మాత్రం టచ్‌ చేయలేదు. ప్రేమకథా చిత్రం మూవీ చూసిన ప్రభాస్‌కు అలాంటి హారర్‌ మూవీ ఒకటి చేయాలని కోరిక పుట్టింది. ఆ సమయంలో మారుతి కలవడం, కథ చెప్పడం, అది నచ్చడంతో ది రాజా సాబ్‌ సెట్స్‌ మీదకు వెళ్లింది. అయితే మారుతి డైరెక్ట్‌ చేసిన చివరి చిత్రం పక్కా కమర్షియల్‌ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది.

అభయమిచ్చిన ప్రభాస్‌ అలాంటి సమయంలో పాన్‌ ఇండియా హీరోతో సాహసం చేయడం దేనికని దర్శకుడు వెనకడుగు వేశాడు. తర్వాతెప్పుడైనా చూద్దామని వాయిదా వేయాలనుకున్నాడు. కానీ, ప్రభాస్‌ ఒప్పుకోలేదు. కథ నచ్చిందని.. ముందుకు వెళ్దామని అభయం ఇవ్వడంతో మారుతి ( Director Maruthi ) రెట్టింపు జోష్‌తో రాజా సాబ్‌ ( The Raja Saab Movie ) తెరకెక్కించాడు. పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కానుంది.

ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్

ఇద్దరు హీరోయిన్లు కావాలి సోమవారం (జూన్‌ 16న) రాజాసాబ్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మారుతి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ప్రభాస్‌ సరదాగా మాట్లాడుతూ.. సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా? అని అడిగాడు. సలార్‌లో ఉన్న కథానాయిక ఎప్పుడో ఒకసారి వస్తుంది. కల్కి 2898 ఏడీలో కూడా ఒకమ్మాయి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది. ఆదిపురుష్‌లోనేమో సీతాదేవి ఎక్కడో ఉంటుంది.

ఇద్దరేం ఖర్మ.. ముగ్గురిని తీసుకొచ్చిన డైరెక్టర్‌ నా దగ్గర, నా ఇంట్లో ఎవరూ లేరు డార్లింగ్‌.. ఇద్దరు హీరోయిన్లను పెడతావా? అన్నాడు. అప్పుడు ఆయన్ను ఎగాదిగా చూసి మీ రేంజ్‌కు ఇద్దరేంటి? ముగ్గుర్ని పెడతానన్నాను. అలా ముగ్గురు హీరోయిన్లను తీసుకెళ్లి హారర్‌ కొంపలో పెట్టాను. ఇది రొమాంటిక్‌ హారర్‌ ఫాంటసీగా తెరకెక్కించాను అని మారుతి చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు పాపం.. ప్రభాస్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీలను చాలా మిస్సవుతున్నట్లున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్‌ సినిమాలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు.

మారుతి వివరణ

ప్రభాస్ కోరిక మేరకు మారుతి ముగ్గురు హీరోయిన్లతో రాజా సాబ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ హారర్ కామెడీ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.