|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ పై మారుతి సంచలన నిజం: అసలు కథే వేరు..!

Published: 01-01-2026, 7:30 AM
ప్రభాస్ 'ది రాజా సాబ్' పై మారుతి సంచలన నిజం: అసలు కథే వేరు..!
  • దర్శకుడు మారుతి ‘ది రాజా సాబ్’ కేవలం హారర్ కామెడీ కాదని స్పష్టం చేశారు.
  • ప్రభాస్ సినిమాలో హారర్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని వెల్లడి.
  • సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘ది రాజా సాబ్’ జనవరి 9న విడుదల కానుంది.

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాపై దర్శకుడు మారుతి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇది కేవలం హారర్ కామెడీ కాదని, యాక్షన్, ఫాంటసీలతో కూడిన పెద్ద స్కేల్ సినిమా అని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మారుతి క్లారిటీ: ‘ది రాజా సాబ్’ హారర్ కామెడీ కాదా?

The Raja Saab: ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వస్తున్న The Raja Saab సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా పేరు బయటకు వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు.. ఏర్పడ్డాయి. అందులోనూ హారర్ కామెడీ యాక్షన్ ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

తాజాగా దర్శకుడు మారుతి ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ అందరి దృష్టి ఆకర్షించాయి. “హారర్ కామెడీ అంటే ఒకటి రెండు సీన్లు ఉంటాయి. ది రాజా సాబ్ అలాంటి సినిమా కాదు. అసలు అలా దెయ్యం చుట్టూ కామెడీ చేసే సినిమాలు.. తక్కువ బడ్జెట్‌ లో తీయొచ్చు. కానీ ప్రభాస్ లాంటి పెద్ద స్టార్‌ ని పెట్టుకొని అరగంట సేపు అయినా కేవలం హారర్ కామెడీ తో సినిమాని నడపలేం” అని ఆయన స్పష్టం చేశారు.

మారుతి ఈ ఒక్క మాటతో ది రాజా సాబ్ చిన్న స్థాయి హారర్ కామెడీ కాదు..పెద్ద స్కేల్‌లో ఉండబోతోందని క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా ప్రభాస్ ఆతిథ్యంతో లింక్ చేస్తూ “ప్రభాస్ గారి ఇంట్లో భోజనం చేసినా 20 రకాల వంటలు పెడతారు. అలాంటప్పుడు సినిమా లో ఎన్ని రకాల ఎలిమెంట్స్ పెట్టాలి?” అని అన్నారు. అలా సినిమా మొత్తం కొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్ తో నిండి ఉంటుందని తెలియజేశారు ఈ దర్శకుడు.

కథలో కొత్తదనం.. స్టార్ కాస్ట్ ఇదే!

ఈ సినిమాలో ప్రభాస్‌ని ఇప్పటివరకు చూడని కొత్త స్టైల్లో మారుతి చూపించబోతున్నారు. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ.. యాక్షన్..ఫాంటసీ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ కథను చెప్పనున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతుండటం మరో హైలైట్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, జరినా వాహబ్ లాంటి నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతి క్యారెక్టర్‌కీ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని టాక్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో ది రాజా సాబ్ భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అన్నీ పెద్ద సినిమాకి తగ్గట్టుగానే ఉండనున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది మరో ఫీస్ట్.. లాంటి సినిమా అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ గ్రాండ్ ఎంటర్టైనర్ సినిమా జనవరి 9న విడుదల కానుంది.

భారీ అంచనాలతో జనవరి 9న విడుదల

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈ సినిమానే కాకుండా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రానున్న స్పిరిట్ సినిమాతో కూడా ఈ సంవత్సరం ప్రేక్షకులను ఆకట్టుకొని ఉన్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు న్యూ ఇయర్ కానుకగా 12 గంటలకు విడుదల అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ లుక్ లో ప్రభాస్ ఎప్పుడు లేనంత రఫ్గా కనిపించడంతో.. ఈ సినిమాలో సందీప్ రెడ్డి ప్రభాస్ ని ఓ లెవెల్ లో చూపించనున్నారు అన్న విషయం అందరికీ అర్థమైపోయింది.

మారుతి ప్రకటనతో ‘ది రాజా సాబ్’ కేవలం ఒక జానర్‌కు పరిమితం కాదని, ప్రభాస్ అభిమానులకు విందు భోజనంలా ఉంటుందని స్పష్టమైంది. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.