|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశా.. మాస్ జాతరపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 29-10-2025, 1:45 PM
ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశా.. మాస్ జాతరపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు భాను భోగవరపు సినిమా కోసం చేసిన రీసెర్చ్, రైల్వే పోలీస్ నేపథ్యం, రవితేజ టైటిల్ సూచన వంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Key Points

1

రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర' అక్టోబర్ 31న విడుదల కానుంది.

2

దర్శకుడు భాను భోగవరపు కథ కోసం రైల్వే పోలీస్ అధికారులను కలిసి రీసెర్చ్ చేశారు.

4

సినిమాలో మాస్ అంశాలతో పాటు క్రైమ్, కొత్త పాయింట్, సర్‌ప్రైజ్‌లుంటాయి.

దర్శకుడు భాను భోగవరపు రీసెర్చ్

మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ కాగా.. ఈ హైప్ మరింత పెంచేశాడు డైరెక్టర్ భాను భోగవరపు. ‘ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది. ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో జరిగే ఈ కథలో క్రైమ్ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. రవితేజనే ‘మాస్ జాతర’ టైటిల్ చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్‌లో ప్రేక్షకులు కొన్ని సర్‌ప్రైజ్‌లు చూడబోతున్నారు’ అంటూ తెలిపారు భాను.

రవితేజ సూచించిన ‘మాస్ జాతర’ టైటిల్

చిత్రంలో కొత్తదనం, విడుదలకు సన్నద్ధం

మొత్తానికి, దర్శకుడు భాను భోగవరపు విస్తృత రీసెర్చ్, రవితేజ సూచనలతో ‘మాస్ జాతర’ ఒక కొత్త కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. థియేటర్‌లో సినిమా ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.