|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్‌ హీరో అడవి శేష్‌ను దూరం పెట్టిన అనసూయ: ఆమె చేసిన తప్పు ఏంటి?

Published: 17-12-2025, 6:44 AM
స్టార్‌ హీరో అడవి శేష్‌ను దూరం పెట్టిన అనసూయ: ఆమె చేసిన తప్పు ఏంటి?
  • అనసూయ కెరీర్ గ్రాఫ్: సినిమాలు, టీవీ షోలపై చర్చ, క్రేజ్ తగ్గిందని విశ్లేషణ.
  • హీరోలంతా తమను లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని అనసూయ అపోహ పడింది.
  • యువ హీరో అడవి శేష్‌ను తప్పుగా అర్థం చేసుకుని, అతన్ని అప్పట్లో దూరం పెట్టింది.
  • తర్వాత తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడినట్లు అనసూయ ఇటీవల వెల్లడించింది.

యాంకర్, నటి అనసూయ పాత వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆమె హీరోలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు, ముఖ్యంగా స్టార్ హీరో అడవి శేష్‌తో తన అనుభవం గురించి వెల్లడించింది. హీరోలంతా తమను లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఆమె పొరపాటుపడింది.

అనసూయ క్రేజ్ తగ్గిందా?

స్టార్‌ యాంకర్‌, నటి అనసూయ చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క మూవీనే ఉంది. అయితే ఆమె ఆచితూచి సినిమాలు చేస్తుందా లేక, అవకాశాలు తగ్గాయా? అనేది క్లారిటీ లేదుగానీ, అనసూయ ఎక్కువగా ఖాళీగానే ఉంటుంది. అడపాడదపా టీవీ షోస్‌లో మెరుస్తుంది. తన మనుగడని చాటుకుంటోంది. కాకపోతే జబర్దస్త్ షో టైమ్‌లో ఉన్న క్రేజ్‌ ఇప్పుడు లేదని చెప్పొచ్చు. అప్పుడు నిత్యం అనసూయకి సంబంధించి సోషల్‌ మీడియా చర్చ జరిగేది. ఆమెని కామెంట్‌ చేయడం, ట్రోల్‌ చేయడం, దానికి అనసూయ రియాక్డ్ కావడం, దీంతో నెట్టింట పెద్ద రచ్చ రచ్చ జరిగేది. కానీ ఇప్పుడు ఆ వైభవం లేదు.

కానీ అప్పట్లో కొందరిపై అనసూయ పోలీస్‌ కంప్లెయింట్‌ చేసింది. జైల్లో పెట్టించింది. మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో చాలా వరకు నెటిజన్లు తగ్గారు. ఆమెని ట్రోల్‌ చేయడం ఆపేశారు. అంతేకాదు ఇప్పుడు అసలు పట్టించుకోలేదు. అనసూయ గ్లామర్‌ ఫోటోలు పెట్టినా, పెద్దగా రియాక్షన్‌ లేదు. అది ఆమె క్రేజ్‌ తగ్గిందని చెప్పడానికి నిదర్శమంటున్నారు. అనసూయ కూడా కాస్త హుందాగా వ్యవహరిస్తోంది.

హీరోలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే అనసూయ హీరోలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. దాదాపు 12ఏళ్ల క్రితం నాటి విషయాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెబుతూ, హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని, అందుకే తాను అప్పట్లో హీరోలను అవాయిడ్‌ చేసినట్టు చెప్పింది అనసూయ. హీరోలపై తాను మరో రకమైన ఒపీనియన్‌తో ఉన్నట్టు చెప్పింది. ఆ తర్వాత తాను చేసిన తప్పుని తెలుసుకుని రియలైజ్‌ అయ్యిందట.

అనసూయ చెబుతూ, `నేను దేవిశ్రీ ప్రసాద్ అమెరికా టూర్‌ చేశాము. ఆ టైమ్‌లో అడవి శేష్‌ నన్ను అప్రోచ్‌ అయ్యాడు. హీరోలు అందరు లైన్‌ వేయడానికి అప్రోచ్‌ అవుతారు అనుకొని ఆయన్ని నేను తెగ అవాయిడ్‌ చేసేదాన్ని` అని తెలిపింది అనసూయ. హీరోలపై ఉన్న తప్పుడు ప్రచారం నేపథ్యంలో తాను ఇలాంటి తప్పు చేసినట్టు అనసూయ పేర్కొంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. అడవి శేషు హీరోగా రూపొందిన `క్షణం` మూవీలో అనసూయ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇది 2016లో విడుదలై విజయం సాధించింది.

అడవి శేష్‌ను దూరం పెట్టిన అసలు కారణం

అయితే 2013 టైమ్‌లో అడవి శేషు ఒకటి అర సినిమాలతో రాణిస్తున్నారు. క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అలాంటి టైమ్‌లో అనసూయ ఆయన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆయన ఒక హీరోగా, ఆల్మోస్ట్ స్టార్‌గా రాణిస్తుండటం విశేషం. ప్రస్తుతం అడవి శేషు `డెకాయిట్‌` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

అనసూయ టీవీ యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా మారింది. కొన్ని సినిమాలు చేసింది. కానీ గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌ గా చేసే అవకాశం ఉంది. దీంతో పాపులర్‌ అయిపోయింది. స్టార్‌ యాంకర్‌గా వెలిగింది. సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. కొన్నేళ్లపాటు ఇంటర్నెట్‌ని రూల్‌ చేసింది. ఇప్పుడు జబర్దస్త్ షోకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు, తనపై వేసే పంచ్‌లు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి, అవి తన పిల్లలకు అర్థం అవుతాయని చెప్పి షోని వదిలేసినట్టు తెలిపింది అనసూయ. ప్రస్తుతం సినిమాలకే పరిమితమయ్యింది.

మొత్తానికి అప్పట్లో అనసూయ చేసిన తప్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అడవి శేష్‌పై ఆమెకున్న తప్పుడు అభిప్రాయం, ఆ తర్వాత ఆమె రియలైజేషన్ సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.