
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా పాటపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఓలే ఓలే’ పాటలోని కొన్ని పదాలు అసభ్యంగా ఉన్నాయని ట్రోల్స్ చేశారు. దీనిపై తాజాగా రవితేజ స్పందిస్తూ, ట్రోల్స్ చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Key Points
రవితేజ 'మాస్ జాతర' సినిమా అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి రానుంది.
'ఓలే ఓలే' పాటలోని కొన్ని పదాలపై నెటిజన్ల నుంచి ట్రోల్స్ వెల్లువెత్తాయి.
వివాదాస్పద లిరిక్స్‌పై రవితేజ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, పాట కథ డిమాండ్‌ను బట్టే ఉందని చెప్పారు.
రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో అంచనాలున్నాయి.
‘మాస్ జాతర’ పాటపై వివాదం ఎందుకు?
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)నటిస్తున్న మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘మాస్ జాతర’ (mass jathara) . ఈ సినిమా పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈక్రమంలోనే.. రవితేజ ‘మాస్ జాతర’ ఫుల్ ఎంటర్‌టైన్ చేసేందుకు అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్రబృందం ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ట్రోల్స్ చేస్తున్న వారికి రవితేజ స్ట్రాంగ్ కౌంటర్
వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, రవితేజ, శ్రీలీల (sreeleela) భాను భోగవరపు సుమతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. గత కొద్ది రోజులుగా ‘మాస్ జాతర’ సాంగ్‌పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లకు రవితేజ కౌంటర్ ఇచ్చాడు. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఓలే ఓలే సాంగ్ బాగానే మార్కులు కొట్టేసి యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయింది. ఇది ఎంతగా పాపులర్ అయ్యిందో.. అంతే స్థాయిలో విమర్శలు, ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. ఇందులో ‘‘నీ అమ్మ, నీ అయ్యా, నీ అక్క, నీ చెల్లి గుంట నీ ఒళ్లో కొచ్చి పంట, సిగ్గు లేదు, షేరము లేదు, లాగు లేదు’’ అనే పదాలు వివాదాస్పదమయ్యాయి. చాలామంది అసభ్యంగా ఉందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
‘మాస్ జాతర’ సినిమా విశేషాలు
జానపద స్టైల్ పేరుతో పాటలను పాడు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రవితేజ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘పాటలోని కొన్ని లైన్స్ మాత్రమే విని కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ ఆ పాట అర్థం తెలియాలంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు.. మొత్తం వినండి. ఈ పాటను కథ డిమాండ్‌ను బట్టి పెట్టారు’’ అని చెప్పుకొచ్చారు. కాగా, ‘మాస్ జాతర’ మూవీ శ్రీలీల, రవితేజ కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
రవితేజ తన సినిమా పాటపై వచ్చిన విమర్శలను కొట్టిపారేస్తూ, కథకు తగినదేనని స్పష్టం చేశారు. ఈ వివరణతో ట్రోల్స్ సద్దుమణగవచ్చని ఆశిద్దాం. అక్టోబర్ 31న విడుదలయ్యే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


