|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బలమైన కోరికతో ఈ సినిమా చేశాను.. తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది: వజ్రయోగి

Published: 09-11-2025, 8:20 AM
బలమైన కోరికతో ఈ సినిమా చేశాను.. తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది: వజ్రయోగి

వజ్రయోగి, శ్రేయ భర్తీ జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సీమంతం’ నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో వజ్రయోగి మాట్లాడుతూ, బలమైన కోరికతో సినిమా చేశానని, తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ప్రేక్షకుల ప్రోత్సాహం కోరారు.

Key Points

1

'సీమంతం' క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో వజ్రయోగి, శ్రేయ భర్తీ జంటగా నటించారు.

2

సుధాకర్ పాణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.

4

గర్భవతులపై దాడుల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ టీజర్ మంచి స్పందన పొందింది.

‘సీమంతం’ మూవీ విడుదల వివరాలు

వజ్రయోగి(Vajrayogi), శ్రేయ భర్తీ (Shreya Bharti)జంటగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సీమంతం’(seemantham). సుధాకర్ పాణి దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుండగా.. టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతోంది. గర్భవతులపై దాడుల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ టీజర్‌ గ్రిప్ చేసే బీజీఎం, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ- రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వజ్రయోగి మాట్లాడుతూ… బలమైన కోరికతో ‘సీమంతం’ సినిమా చేశాను. కొత్తవారికి ఎప్పుడూ ఎంకరేజ్ చేసే ఆడియన్స్ మమ్మల్ని తప్పకుండా బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది.

క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వస్తోన్న మా చిత్రం అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. మా డైరెక్టర్ సుధాకర్ గారు ఈ సినిమాను చాలా కొత్తగా తీశారు. తనకు నాకు మా యూనిట్ అందరికి ‘సీమంతం’ పెద్ద హిట్ ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నాను’’ అన్నారు. అనంతరం డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ… ‘సీమంతం’ చిత్ర నిర్మాత హీరో వజ్రయోగి నా ఫ్రెండ్.. నా కాలేజ్ ఫ్రెండ్‌తో నేను ఈ ప్రాజెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. సుహాస్ సంగీతం మనకు ట్రైలర్‌లో చూస్తే అర్థం అవుతుంది.. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నవంబర్ 14న మా సీమంతం సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

వజ్రయోగి నమ్మకం.. ప్రేక్షకుల ఆదరణ

దర్శకుడు సుధాకర్ పాణి మాటలు

దర్శకుడు సుధాకర్ కూడా తమ సినిమా గొప్పగా వచ్చిందని, నవంబర్ 14న థియేటర్లలో చూడాలని కోరారు. ‘సీమంతం’ మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.