|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మయసభ రివ్యూ- చంద్రబాబు, వైఎస్సార్ ఓటీటీ పొలిటికల్ థ్రిల్లర్- దేవ కట్టా మరో రాజకీయ మాయజాలం హిట్ కొట్టిందా?

Published: 07-08-2025, 12:42 AM
మయసభ రివ్యూ- చంద్రబాబు, వైఎస్సార్ ఓటీటీ పొలిటికల్ థ్రిల్లర్- దేవ కట్టా మరో రాజకీయ మాయజాలం హిట్ కొట్టిందా?

ప్రముఖ దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించిన ‘మయసభ’ ఓటీటీ సిరీస్ ఇటీవల విడుదలైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సిరీస్, రాజకీయాలను ఎలా చిత్రీకరించారో తెలుసుకుందాం.

Key Points

1

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రలు

2

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జీవితాల ఆధారంగా

4

దేవ కట్టా దర్శకత్వం వహించిన రాజకీయ థ్రిల్లర్

కథానాయికలు మరియు వారి పాత్రలు

నటీనటులు: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, దివ్యా దత్తా, రవీంద్ర విజయ్, తాన్య రవిచంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు, శంకర్ మహంతి, చరిత వర్మ తదితరులు

దర్శకులు: దేవ కట్టా, కిరణ్ జయకుమార్

సంగీతం: శక్తికాంత్ కార్తీక్

సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుటు, జ్ఞానశేఖర్

నిర్మాతలు: విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష

ఓటీటీ ప్లాట్‌ఫామ్: సోనీ లివ్

ఓటీటీ రిలీజ్ డేట్: ఆగస్ట్ 6, 2025

రాజకీయ నేపథ్యం మరియు కథాంశం

ఎపిసోడ్స్: 9 (సుమారు 40 నిమిషాలు)

ప్రస్థానం వంటి సూపర్ హిట్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాను అందించిన డైరెక్టర్ దేవ కట్టా నుంచి వచ్చిన సరికొత్త తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ఓటీటీ వెబ్ సిరీస్ మయసభ రైజ్ ఆఫ్ ది టైటాన్స్. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితాల ఆధారంగా తెరకెక్కిన మయసభలో ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రలు పోషించారు.

మొదటి నుంచే మంచి క్రేజ్ తెచ్చుకున్న మయసభ ఓటీటీలోకి వచ్చేసింది. సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్ట్ 6 నుంచి ఐదు భాషల్లో మయసభ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కువ సోషల్ ఎలిమెంట్స్‌తో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దేవ కట్టా, ఆయనతోపాటు మరో డైరెక్టర్ కిరణ్ జయకుమార్ క్రియేట్ చేసిన ఈ రాజకీయ మాయజాలం ఎలా ఉందో నేటి మయసభ రివ్యూ లోకి తెలుసుకుందాం.

రైతు కుటుంబంలో జన్మించిన కేకేఎన్/కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి) బాగా చదివి విద్యాధికుడు అవుతాడు. రాజకీయాలు అంటే ఆసక్తి. మరోవైపు ఎంఎస్ఆర్/రామిరెడ్డి (చైతన్య రావు) ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చి డాక్టర్ అవుతాడు. ఒనానొక సందర్భంలో వీరిద్దరు కలుసుకుని స్నేహితులు అవుతారు. రాజకీయాల్లోకి చేరి రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చాలని కలలు కంటారు.

కేంద్రంలో ప్రధాన మంత్రి ఐరావతి బసు ( దివ్యా దత్తా ) విధించిన ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రాజకీయాల్లో జరిగిన పరిణామాలు ఏంటీ? వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేసి గెలిచిన ఇద్దరు స్నేహితులు కేకేఎన్, ఎంఎస్ఆర్ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది? అగ్ర హీరో ఆర్‌సీఆర్/రాయపాటి చక్రధర్ రావు ( సాయి కుమార్ )కు కేకేఎన్ ఎలా అల్లుడు అయ్యాడు? రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తప్పింది ఎవరు? ఎవరి వ్యూహాలు ఏంటీ? అనేది తెలియాలంటే ఓటీటీ సిరీస్ మయసభ చూడాల్సిందే.

మయసభ ఓటీటీ సిరీస్‌ ను మేకర్స్ ఒక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పుకొచ్చారు. కానీ, మయసభ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే హీరో ఆది పినిశెట్టి పాత్రను చంద్రబాబు నాయుడు, చైతన్య రావు రోల్‌ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాల ఆధారంగా, స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించినట్లు ఈజీగా తెలిసిపోతుంది. వీరే కాకుండా సీనియర్ ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, పరిటాల రవి వంటి ప్రముఖులు కూడా గుర్తొస్తారు.

ఇక ప్రస్థానం, రిపబ్లిక్ వంటి సినిమాలతో దేవ కట్టా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి డైరెక్టర్ నుంచి ఓ పొలిటికల్ థ్రిల్లర్, అది కూడా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చిన ఇద్దరు గొప్ప నేతల స్ఫూర్తితో వస్తుందంటే ఆ సిరీస్‌పై ఎన్నో అంచనాలు ఉంటాయి. అలాంటి అంచనాలను దేవ కట్టా, కిరణ్ జయ కుమార్ ద్వయం అవలీలగా అందుకుంది.

దర్శకత్వం మరియు నటన

అటు చంద్రబాబు , ఇటు వైఎస్సార్ రెండు పాత్రలను సమపాళ్లలో చూపించి ఆకట్టుకున్నారు. చెప్పాలంటే ఎలాంటి వివాదాలు రాకుండా చాలా జాగ్రత్తపడ్డారు. సిరీస్ ప్రారంభం నుంచి ముగింపు వరకు పరిస్థితులు, వ్యూహాలు తప్పితే ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావన రాదు. ఏ ఒక్కరి కోసం తలొగ్గకుండా పర్‌ఫెక్ట్ బ్యాలెన్స్‌తో క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌తో ఆకట్టుకున్నారు.

స్నేహితులుగా మొదలైన చంద్రబాబు, వైఎస్సార్ ప్రయాణం శత్రువులు ఎలా మారారు అనే కథాంశం వరకు మయసభ మొదటి సీజన్ సాగింది. వ్యూహాలు రచించడంలో కృష్ణమ నాయుడు (చంద్రబాబు) దిట్ట అని చూపించిన డైరెక్టర్స్ పాలిటిక్స్ కోసం కులం సపోర్ట్‌ను రామిరెడ్డి (వైఎస్సార్) ఎలా తీసుకున్నారో చూపించేలా సన్నివేశాలు సాగాయి.

ఇక సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నారు. కేకేఎన్, ఎంఎస్సార్ పాత్రల నేపథ్యాన్ని మార్చేశారు. దానివల్లే సిరీస్‌లోని రెండు పాత్రలు చంద్రబాబు, వైఎస్సార్‌ జీవితాలకు సంబందం లేదని మేకర్స్ చెప్పేందుకు ఉదాహరణగా నిలిచాయి. కేకేఎన్ లవ్ స్టోరీ కొన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు. డైలాగ్స్ చాలా బాగున్నాయి.

రాయపాటి చక్రధర్ రావు(ఎన్టీఆర్) ఎంట్రీతో సిరీస్ మరింత ఆసక్తిగా సాగుతుంది. ఆర్సీఆర్, ప్రధాని ఎమర్జెన్సీ ఎపిసోడ్, ముఖ్యమంత్రి మార్పు వంటివి ఆకట్టుకుంటాయి. ఓ పాట చాలా బాగుంది. సంగీతం, బీజీఎమ్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు, కాస్ట్యూమ్స్ పర్వాలేదు.

ఇక ఆది పినిశెట్టి, చైతన్య రావు నటన మెప్పించేలా ఉంది. రియల్ పాత్రలను ఇమిటేట్ చేయకుండా మ్యానరిజాన్ని పట్టుకుని అలా వ్యక్తపరచడం అంత సులభం కాదు. కానీ, వైఎస్సార్, చంద్రబాబుల హావాభావాలను పర్‌ఫెక్ట్‌గా పలికించారు చైతన్య రావు, ఆది పినిశెట్టి. సాయి కుమార్, శంకర్ మహంతి నటన ఇంపాక్ట్ చూపించేలా ఉంది.

మిగతా పాత్రలు సైతం పరిధిమేర ఆకట్టుకున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఏడు ఎపిసోడ్స్‌తో ఉన్న మయసభ థ్రిల్లింగ్ పొలిటికల్ డ్రామా. అయితే, అసలు కథ మొదలయ్యేది మాత్రం మయసభ సీజన్ 2లోనే. క్లైమాక్స్‌లో రెండో సీజన్‌కు ఇచ్చిన హింట్‌ మరింత అంచనాలను పెంచేసింది. అసలు రాజకీయ మాయజాలం చూడాలనుకునేవారికి ట్యాగ్ లైన్ ఏంటంటే ‘కథ ఇప్పుడే మొదలైంది’.

మొత్తంమీద, మయసభ ఒక ఆసక్తికరమైన రాజకీయ థ్రిల్లర్. దేవ కట్టా మరోసారి తన రాజకీయ అవగాహనను చూపించారు. ఈ సిరీస్ చూడటం విలువైనదే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.