|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ హీరోయిన్ ఎవరు అంటూ జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు, మయసభలో ఆయన లవ్ స్టోరీ నిజమేనా ?

Published: 08-08-2025, 12:43 AM
ఆ హీరోయిన్ ఎవరు అంటూ జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు, మయసభలో ఆయన లవ్ స్టోరీ నిజమేనా ?

దర్శకుడు దేవకట్టా తెరకెక్కించిన మయసభ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆది పినిశెట్టి, తాన్యా రవిచంద్రన్ ల మధ్య ప్రేమకథ చర్చనీయాంశంగా మారింది. ఈ లవ్ స్టోరీ నిజమేనా అనే ప్రశ్న నెటిజన్లను వేధిస్తోంది.

Key Points

1

మయసభ వెబ్ సిరీస్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

2

తాన్యా రవిచంద్రన్ పాత్ర ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

4

రియల్ లైఫ్ హీరోయిన్ ఎవరు అనేది నెటిజన్లలో ఆసక్తిని రేపుతోంది.

మయసభ వెబ్ సిరీస్ విజయం

విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దేవకట్టా. ప్రస్థానం, ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్ లాంటి చిత్రాలని దేవకట్టా తెరకెక్కించారు. ఆయన రూపొందించే చిత్రాలకు ప్రశంసలు దక్కుతాయి కానీ కమర్షియల్ సక్సెస్ రావడం లేదు. తాజాగా దేవకట్టా రూటు మార్చారు. ఈసారి వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. మయసభ అనే వెబ్ సిరీస్ దేవకట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. ఇది ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగష్టు 7న విడుదలైన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ దేవకట్టా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు లెజెండ్రీ పొలిటీషియన్ల స్నేహం ఆధారంగా రాసుకున్నారు. కానీ ఆ విషయాన్ని మాత్రం బయటకి చెప్పలేదు. అనవసరమైన కాంట్రవర్సీ వద్దనుకున్నారేమో. ఎందుకంటే ఈ సిరీస్ లో వారి పొలిటికల్ లైఫ్, ఫ్రెండ్ షిప్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో ఆది పినిశెట్టి ‘కాకర్ల కృష్ణమనాయుడు(KKN)’ గా, చైతన్య రావు ‘ఎంఎస్ రామిరెడ్డి(MSR)’ గా నటించారు. వీరిద్దరూ పోషించిన పాత్రలు ఇద్దరు రాజకీయ నాయకులని పోలి ఉంటాయి.

తాన్యా రవిచంద్రన్ పాత్ర ప్రాముఖ్యత

మయసభలో దేవకట్టా చూపించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ పోషించిన పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఆమె పాత్ర పాత్ర ఆడియన్స్ కి బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. కాకర్ల కృష్ణమ నాయుడికి ప్రేయసిగా ఆమె నటించింది. ఈ వెబ్ సిరీస్ లో దేవకట్టా మొత్తం నిజాలే చూపించలేదని, కొంత ఫిక్షనల్ స్టోరీ కూడా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కృష్ణమనాయుడు, తాన్యా రవిచంద్రన్ మధ్య జరిగిన లవ్ స్టోరీ నిజంగానే రియల్ లైఫ్ లో జరిగిందా లేదా అంటూ ఆడియన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఆమెతో కృష్ణమ నాయుడు లవ్ ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగినట్లు చూపించారు. రియల్ లైఫ్ లో ఆ హీరోయిన్ ఎవరు అనేదానిపై ఎవరికి వారు తమకి తోచినట్లుగా ఊహించుకుంటున్నారు.

నిజ జీవిత సంఘటనల ప్రతిబింబం?

ఆ పాత్రలో తాన్యా రవిచంద్రన్ అద్భుతంగా నటించింది. గ్లామర్ కూడా ఒలకబోసింది. ఆమెతో ఎమోషనల్ సీన్స్ లో ఆది పినిశెట్టి అదరగొట్టారు. అదే విధంగా ఎంఎస్ రామిరెడ్డి తండ్రి పాత్ర కూడా ఆడియన్స్ కి సర్ప్రైజ్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయన అలాగే ఉండేవారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మూవీ స్టార్ ఆర్సీఆర్ గా సాయి కుమార్ నటించారు. ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఓ రాజకీయ నేత.. మీరంటే నాకు పిచ్చి అభిమానం.. నా కొడుక్కి మీ పేరే పెట్టుకున్నా అని చెప్పే సన్నివేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మయసభ వెబ్ సిరీస్ లోని లవ్ స్టోరీ నిజమేనా కాదా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ప్రేక్షకుల చర్చలు, ఊహాగానాలు ఈ సిరీస్ కి మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.