
📌 Key Points
- వెంకటేష్ మాజీ ప్రియురాలు మీనాక్షి చౌదరి ట్రెడిషనల్ లుక్‌లో అదుర్స్, వైరల్ అవుతున్న ఫోటోలు!
- ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఎంట్రీ, సూపర్ హిట్!
- నాగ చైతన్యతో ‘ఎన్‌సీ-24’ మూవీలో మీనాక్షి, ప్రదీప్ రంగనాథన్‌తో మరో సినిమా!
- నెటిజన్ల కామెంట్స్: మీనాక్షి దేవకన్యలా ఉంది, లంగా ఓణీలో ఆహా అనిపిస్తుంది!
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం!
ట్రెడిషనల్ లుక్‌లో మీనాక్షి చౌదరి మెరుపులు!
‘ ఇచ్చట వాహనములు నిలుపరాదు’(Ichata Vahanamulu Niluparadhu) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత ఈ భామ నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ కావడంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకుంది. తాను నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్న నేపథ్యంలో మీనాక్షి లక్కీ హీరోయిన్ అయిపోయింది.
రీసెంట్‌గా నటించిన ‘అనగనగా ఒకరాజు’ మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ అక్కినేని హీరో నాగ చైతన్య సరసన ‘ఎన్‌సీ-24’ మూవీతో పాటు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన ఓ సినిమాలో యాక్ట్ చేస్తోంది. అలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది మీనాక్షి. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘ఎన్‌సీ-24’లో నాగ చైతన్యతో జోడీ కడుతున్న మీనాక్షి
తాజాగా మీనాక్షి తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు ఎల్లో, మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న లంగా ఓణీలో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించింది. వెస్ట్రన్ వేర్ లోనే కాకుండా ఇటు ట్రెడిషనల్ వేర్ లోనూ మీనాక్షి చూడముచ్చటగా అనిపించింది. నవ్వుతూ మైమరిపించింది. ఇక వీటికి.. ‘కొంచెం నాటీ.. కొంచెం స్వీట్’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు దేవకన్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దేవకన్యలా ఉందంటున్న నెటిజన్లు.. వైరల్ కామెంట్స్!
A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006)
మీనాక్షి చౌదరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె రాబోయే సినిమాల గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందు ఉంటాం.


