
📌 Key Points
- మీనాక్షి శేషాద్రి 62 ఏళ్ల వయసులో ‘అవురా అమ్మక చెల్లా’ పాటకు రీక్రియేట్ చేశారు.
- ఆపద్బాంధవుడు సినిమాలోని ఈ పాటను కులుమనాలిలో చిత్రీకరించారు.
- ప్రస్తుతం అమెరికాలో డాన్స్ టీచర్‌గా స్థిరపడ్డారు మీనాక్షి శేషాద్రి.
- చిరంజీవి, మీనాక్షి కాంబినేషన్ లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమా 5 నంది అవార్డులు గెలుచుకుంది.
టెక్నాలజీ పెరిగిపోవడంతో రీక్రియేషన్ ట్రెండ్ అవుతోంది. మీనాక్షి శేషాద్రి 62 ఏళ్ల వయసులో చిరంజీవితో కలిసి నటించిన ఆపద్బాంధవుడు సినిమాలోని ‘అవురా అమ్మక చెల్లా’ పాటకు రీక్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
34 ఏళ్ల తర్వాత మళ్లీ రీక్రియేట్ చేసిన మీనాక్షి
Tollywood: ఈమధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత..ఫోన్, ఓటీటీ వాడకం అధికంగా మారిన నేపథ్యంలో రీ క్రియేషన్ కూడా ఎక్కువగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో చేసిన పనులను ఇప్పుడు మళ్లీ రీ క్రియేట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు సెలబ్రిటీలు. ఇకపోతే సాధారణంగా ఒక సినిమా రీ రిలీజ్ అయింది అంటే ఆ సినిమాలోని సన్నివేశాలను థియేటర్లలో రీ క్రియేట్ చేసి అభిమానులు సంబరపడిపోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలలోని పలు విషయాలను సెలబ్రిటీలు కూడా రీ క్రియేట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అది కూడా 62 సంవత్సరాల వయసులో రీ క్రియేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ 32 ఏళ్ల తర్వాత కూడా తన అద్భుతమైన డాన్స్ తో అదరగొట్టి ఇప్పుడు 62 ఏళ్ల వయసులో అదే డాన్స్ ను చేసి చూపించింది. అంతేకాదు అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చేస్తే ఎక్కడ ఆ గ్రేస్ తగ్గలేదు అనే చెప్పాలి. మరి ఆమె ఎవరు? ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు మీనాక్షి శేషాద్రి. మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసికల్ మూవీ ఆపద్బాంధవుడు. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా ఐదు నంది అవార్డులను సొంతం చేసుకుంది.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మీనాక్షి శేషాద్రి హీరోయిన్ గా వచ్చిన చిత్రం ఇది. కే విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు (నిర్మాత) కలయికలో రూపొందిన ఆఖరి చిత్రం కూడా ఇదే. పైగా జంధ్యాల తొలిసారి మేకప్ వేసుకున్న చిత్రమిది. అలాంటి ఈ సినిమాలోని ప్రతిపాట కూడా ఒక ఆణిముత్యమే అని చెప్పాలి. అందులో ఒకటి “అవురా అమ్మక చెల్లా” అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాటలో మీనాక్షి శేషాద్రి చిందేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కులు మనాలిలో చిత్రీకరించిన ఈ పాటను ఈ ముద్దుగుమ్మ మళ్లీ 62 ఏళ్ల వయసులో రీ క్రియేట్ చేసి అబ్బురపరిచింది.
చిరంజీవి, మీనాక్షి శేషాద్రి కాంబినేషన్
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం కొంతమంది పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ అమెరికాలోని డల్లాస్ లో డాన్స్ టీచర్గా సెటిల్ అయినా మీనాక్షి శేషాద్రి తాజాగా తన డాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ పాటకు చిందేశారు. ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. 62 ఏళ్ల వయసులో కూడా ఆమె చూపించిన గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అప్పటికి ఇప్పటికీ మీనాక్షి లో ఏమాత్రం మార్పు రాలేదు అని , కేవలం వయసు మాత్రమే తేడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి బ్యూటీ మీనాక్షి శేషాద్రి 1992లో వచ్చిన ఈ పాటను 34 ఏళ్ల తర్వాత కూడా రీ క్రియేట్ చేసి 62 ఏళ్ల వయసులో అందరినీ అబ్బురపరిచింది.
మీనాక్షి శేషాద్రి విషయానికి వస్తే.. హిందీ, తెలుగు, తమిళ్ చిత్రాలలో నటించిన ఈమె అసలు పేరు శశికళ శేషాద్రి. 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో టాలీవుడ్ రంగా ప్రవేశం చేసిన మీనాక్షి.. ఆ తర్వాత 1992లో చిరంజీవి హీరోగా నటించిన ఆపద్బాంధవుడు సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇక తర్వాత మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు. ఎక్కువగా హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన మీనాక్షి 1997 తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు.
నెటిజన్లను ఆకట్టుకుంటున్న డ్యాన్స్ వీడియో
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
మొత్తానికి 62 ఏళ్ల వయసులో కూడా మీనాక్షి శేషాద్రి తన డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించడం విశేషం. ఆమె అప్పటి గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


