|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కాంచన-4’లో మెరిసిన మీరా రాజ్! లారెన్స్‌కు రుణపడి ఉంటానంటూ భావోద్వేగ కామెంట్స్..!

Published: 21-12-2025, 12:44 AM
‘కాంచన-4’లో మెరిసిన మీరా రాజ్! లారెన్స్‌కు రుణపడి ఉంటానంటూ భావోద్వేగ కామెంట్స్..!
  • మీరా రాజ్‌కు రాఘవ లారెన్స్ ‘కాంచన-4’లో కీలక పాత్ర దక్కింది.
  • ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
  • మీరా రాజ్ తనకు అవకాశం ఇచ్చిన లారెన్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రకటించింది.
  • ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి వంటి తారలు కూడా నటిస్తున్నారు.

తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న మీరా రాజ్‌కు ఓ శుభవార్త. రాఘవ లారెన్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘కాంచన-4’లో కీలక పాత్ర దక్కించుకుంది. ఈ బంపర్ ఆఫర్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన మీరా, లారెన్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ.

మీరా రాజ్: ఓ రైజింగ్ స్టార్ ప్రస్థానం

తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న బ్యూటీ మీరా రాజ్(Meera Raj). చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనలోనూ తనకంటూ ప్రత్యేక ఫేమ్ సంపాదించుకుంటూ రైజింగ్ స్టార్‌గా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుని క్రేజీ బ్యూటీగా కొనసాగుతోంది. ఇక ఇటీవల మీరా రాజ్ నటించిన ‘సన్‌ఆఫ్’ చిత్రం మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ ఈ సినిమా కోసం స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మీరా రాజ్ ఓ గుడ్ న్యూస్ వెల్లడించింది. ‘కాంచన-4’ (Kanchana-4)అవకాశం దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాఘవ లారెన్స్(Raghava Lawrence) దర్శకత్వంలో రాబోతున్న ఈ ప్రతిష్ఠాత్య పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మీరాకు కీలక పాత్రలో కనిపించనుంది.

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే లారెన్స్ ఆమెకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మీరా స్పందిస్తూ.. ‘‘నాపై నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ సినిమా కాంచన హారర్ కామెడీ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా రాబోతుంది. ఇందులో పూజా హెగ్డే, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు తుది దశలో ఉన్నట్లు టాక్. లారెన్స్ తనదైన శైలిలో భయం, నవ్వు, యాక్షన్ కలగలిపిన కథనంతో మరో బ్లాక్ బస్టర్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో రాబోతున్న ఈ సినిమాకు లారెన్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

‘కాంచన-4’లో బంపర్ ఆఫర్

రాఘవ లారెన్స్‌కు రుణపడి ఉంటానంటూ

మీరా రాజ్ కెరీర్‌లో ‘కాంచన-4’ ఒక కీలక మలుపు కానుంది. రాఘవ లారెన్స్ వంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో అవకాశం దక్కడం ఆమెకు కలిసొచ్చే అంశం. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.