|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Meesala Pilla Full Song: ‘ఏయ్.. మీసాల పిల్ల’.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!

Published: 14-10-2025, 7:11 AM
Meesala Pilla Full Song: 'ఏయ్.. మీసాల పిల్ల'.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం నుండి ‘మీసాల పిల్లా’ ఫుల్ లిరికల్ సాంగ్ విడుదలైంది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ రొమాంటిక్ గీతం మూవీపై అంచనాలను పెంచుతోంది.

Key Points

1

'మన శంకరవరప్రసాద్‌గారు' చిత్రం నుండి 'మీసాల పిల్లా' ఫుల్ సాంగ్ విడుదల.

2

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం.

4

నయనతార హీరోయిన్‌గా, సంక్రాంతి కానుకగా మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

మీసాల పిల్లా సాంగ్ హైలైట్స్

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ చిత్రం  మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌తో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళ్తున్నారు.

ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్‌ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.  ఈ రొమాంటిక్‌ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ విశేషాలు

సంగీత దర్శకుడు, గాయనీగాయకులు

మొత్తానికి, ‘మీసాల పిల్లా’ సాంగ్ విడుదల ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంపై హైప్‌ను మరింత పెంచింది. ఈ రొమాంటిక్ గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలను నెలకొల్పింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.