|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ చిరంజీవితో సినిమా.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

Published: 04-11-2025, 10:09 AM
మెగాస్టార్ చిరంజీవితో సినిమా.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా వార్తలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం తాను ఏ సినిమాను నిర్మించడం లేదని, ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Key Points

1

బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

2

చిరంజీవితో సినిమాపై వస్తున్న వార్తలను బండ్ల గణేష్ ఖండించారు.

4

ఓ యంగ్ హీరోను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ విమర్శలు.

బండ్ల గణేష్ హాట్ కామెంట్స్

టాలీవుడ్(Tollywood) స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. నిన్న కిరణ్ అబ్బవరం కే-ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు. మరోవైపు.. ఓ యంగ్ హీరోను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క సినిమా హిట్టు పడగానే అర్ధరాత్రి కళ్లజోడు తీయట్లేడని విమర్శించారు. అయితే.. విజయ్ దేవరకొండను ఉద్దేశించే బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట తీవ్ర చర్య నడుస్తోంది. మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో బండ్ల గణేష్ సినిమా ఓకే అయిందని.. ఇక నుంచి మళ్లీ ప్రొడ్యూసర్‌గా వేగం పెంచబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై బండ్ల గణేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వివరణ పోస్టు పెట్టారు.

చిరంజీవితో సినిమాపై వార్తలు

‘‘మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం.. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు.. అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు.. దయచేసి తప్పుడు వార్తలు రాయకండి.. నన్ను ఇబ్బంది పెట్టకండి.. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో ఉండాలి.. చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను’’ బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.

సోషల్ మీడియాలో బండ్ల గణేష్ వివరణ

ప‌వ‌న్ తో కాదు…చిరంజీవితో బండ్ల గణేష్ అదిరిపోయే సినిమా ?

మొత్తంగా, బండ్ల గణేష్ చిరంజీవితో సినిమా వార్తలకు స్వస్తి పలికారు. ప్రస్తుతానికి నిర్మాణ రంగంలోకి తిరిగి రావడం లేదని తేల్చి చెప్పారు. ఆయన తదుపరి నిర్ణయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.