|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీసాల పిల్ల.. యూట్యూబ్‌లో ఇప్పుడిదే ట్రెండింగే పిల్లా!

Published: 27-10-2025, 5:22 AM
మీసాల పిల్ల.. యూట్యూబ్‌లో ఇప్పుడిదే ట్రెండింగే పిల్లా!

చిరంజీవి నటించిన “మన శంకరవరప్రసాద్ గారు” చిత్రంలోని “మీసాల పిల్ల” పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. 36 మిలియన్ల వ్యూస్‌తో 13 రోజులుగా నెంబర్ 1 ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాట, చిరంజీవి స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లిరికల్ వీడియోకే ఈ స్థాయిలో స్పందన లభిస్తోంది.

Key Points

1

చిరంజీవి సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'లోని 'మీసాల పిల్ల' పాట సంచలనం సృష్టిస్తోంది.

2

ఈ పాట యూట్యూబ్‌లో 36 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో దూసుకుపోతోంది.

4

చిరంజీవి స్టైలిష్‌ స్టెప్పులు, ఉదిత్‌ నారాయణ్‌, శ్వేత మోహన్‌ గానం పాటకు ప్రధాన ఆకర్షణ.

రికార్డులు సృష్టిస్తున్న మీసాల పిల్ల పాట

హిట్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఈ ఏడాది పొంగల్‌కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్‌బస్టర్‌ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ ( Mana Shankaravaraprasad Garu Movie )లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.

36 మిలియన్ల వ్యూస్‌ ( Meesaala Pilla Song ) యూట్యూబ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్‌ అందుకుంది. ఈ సాంగ్‌లో చిరు వేసే స్టెప్పులు సింపుల్‌గా కనిపిస్తూనే చాలా స్టైలిష్‌గా ఉంటాయి. లిరికల్‌ సాంగ్‌కే ఈ రేంజ్‌లో రెస్పాన్స్‌ వస్తే ఇక వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!

చిరంజీవి స్టెప్పులు, పాట విశేషాలు

సినిమా భీమ్స్‌ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్‌ నారాయణ్‌, శ్వేత మోహన్‌ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్‌ లిరిక్స్‌ రాశాడు. పోలకి మాస్టర్‌ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్‌గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.

“మన శంకరవరప్రసాద్ గారు” చిత్ర బృందం

“మీసాల పిల్ల” పాట కేవలం లిరికల్ వీడియోతోనే ఈ స్థాయి విజయం సాధించడం విశేషం. పూర్తి వీడియో సాంగ్ విడుదలయ్యాక మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.