|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా 158: కూతురిగా ఫిక్స్ అయిన బ్యూటీ ఎవరో తెలిస్తే షాక్! బ్లాక్ బస్టర్ బొమ్మ పడేలా ఉందిగా!!

Published: 08-03-2026, 12:35 PM
మెగా 158: కూతురిగా ఫిక్స్ అయిన బ్యూటీ ఎవరో తెలిస్తే షాక్! బ్లాక్ బస్టర్ బొమ్మ పడేలా ఉందిగా!!
  • మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబోలో రానున్న మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ!
  • ఈ చిత్రంలో చిరంజీవికి కూతురుగా అన‌శ్వ‌ర రాజ‌న్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
  • అన‌శ్వ‌ర రాజ‌న్‌పై 25 రోజుల షూటింగ్.. 40 రోజుల డేట్స్ బ్లాక్ చేసిన మేకర్స్!
  • ప్రియమణి కూడా ఈ చిత్రంలో చిరుకి జోడిగా నటించే అవకాశం.. అంచనాలు భారీగా!

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మెగా 158 చిత్రం గురించి ఒక అదిరిపోయే న్యూస్! ఈ సినిమాలో హీరోయిన్ కూతురి పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

చిరు సినిమాలో కూతురుగా అనశ్వరా రాజన్?

మెగాస్టార్ చిరంజీవి, బాబి కొల్లి కాంబోలో కొంతకాలం క్రితం వాల్టేరు వీరయ్య అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాకు కోన వెంకట్ కూడా కథ, స్క్రీన్ ప్లే విషయంలో బాబీకి సహాయం చేస్తున్నాడు. కోన వెంకట్ కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఈసారి చిరంజీవి గారితో బాబీ చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది, అది ఇప్పటివరకు చిరంజీవి గారు తన కెరీర్లో చేయని తరహా సినిమా అని చెప్పుకొచ్చాడు.

25 రోజుల షూటింగ్ కోసం 40 రోజులు బ్లాక్!

ఈ చిత్రంలో ప్రియమణి, చిరుకి జోడిగా నటించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి అన‌శ్వ‌ర రాజ‌న్, చిరంజీవికి కూతురు పాత్రలో ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ముద్దుగుమ్మపై దాదాపు 25 రోజులపాటు షూటింగ్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు, కానీ ఈమెకు సంబంధించిన 40 రోజుల డేట్స్ ఈ మూవీ యూనిట్ తీసుకున్నట్లు, దానితో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పాత్రను ముగించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రియమణితో చిరు జోడి కట్టే ఛాన్స్?

ఈ సినిమా గనుక మంచి విజయం సాధించినట్లయితే ఈ యువ నటికి తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు దక్కే అవకాశం ఉంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలోనే ఛాంపియన్, విత్ లవ్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండింటిలో ఛాంపియన్ ప్రేక్షకులను నిరాశపరిచిన విత్ లవ్ మాత్రం జనాలను బాగానే ఆకట్టుకుంది.

మెగా 158 గురించి ఈ వార్త ఒక సంచలనం. అనశ్వరా రాజన్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.