|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా కపుల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్: వరుణ్-లావణ్య ముద్దుల కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూడండి!

Published: 26-12-2025, 1:16 AM
మెగా కపుల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్: వరుణ్-లావణ్య ముద్దుల కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూడండి!
  • వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1, 2023న జరిగింది.
  • ఈ జంటకు సెప్టెంబర్ 2025లో మగబిడ్డ జన్మించాడు, పేరు వాయువ్ తేజ్ కొణిదెల.
  • వాయువ్ తేజ్ ఫేస్ ఇప్పటి వరకు రివీల్ చేయకపోయినా, తాజాగా క్రిస్మస్ ఫొటో వైరల్ అయింది.
  • క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా మెగా కపుల్ తమ బాబుతో క్యూట్ ఫొటోను పంచుకున్నారు.

టాలీవుడ్ మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ ముద్దుల కొడుకు వాయువ్ తేజ్ కొణిదెలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మెగా వారసుడు వాయువ్ తేజ్ తొలి క్రిస్మస్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు బాబు అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వరుణ్-లావణ్యల ప్రేమ ప్రయాణం.. వివాహం వరకు

టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej)- అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ల జంట‌ ఒక‌టి. ‘మిస్టర్’(Mister), ‘అంతరిక్షం’(Antariksham) అనే సినిమాల్లో జంటగా నటించిన వీరు ఆ టైమ్‌లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ విషయాన్ని బయట పడకుండా సీక్రెట్‌గా లవ్ చేసుకుని డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోస్‌తో ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చారు. అలా సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపిన ఈ జంట నవంబర్ 1, 2023లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

అయితే ఈ జంటకు సెప్టెంబర్ 2025లో మగబిడ్డ కూడా జన్మించాడు. దీంతో వీరిద్దరు తల్లిదండ్రులు ప్రమోషన్స్ పొందారు. అయితే బాబుకు ‘వాయువ్ తేజ్ కొణిదెల’(Vayuv Tej Konidela) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు అతని ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఈ క్రమంలో అతనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ జంట తమ బాబుతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంది.

మెగా వారసుడు వాయువ్ తేజ్ కొణిదెల ఎంట్రీ!

ఆ పిక్స్‌లో వరుణ్ వాయువ్‌ను ఎత్తుకుంటే లావణ్య అది చూసి మురిసిపోతుంది. ఇక ఫొటోలో బాబు ఫేస్ కనబడకపోయినప్పటికీ మెగా వారసుడు చాలా అందంగా క్యూట్‌గా ఉన్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..‘క్రిస్మస్ కోసం మనం కోరుకునేది ఇక్కడే’ అనే క్యాప్షన్ జోడించారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

క్రిస్మస్ సంబరాల్లో మెగా కపుల్: క్యూట్ వాయువ్ ఫొటో వైరల్

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

మెగా కపుల్ షేర్ చేసిన ఈ క్యూట్ క్రిస్మస్ ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాయువ్ తేజ్ ఫేస్ పూర్తిగా కనిపించకపోయినా, మెగా వారసుడి అందంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సెలబ్రేషన్స్ మెగా అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.