
📌 Key Points
- మెగా ఫ్యామిలీలో వరుస విషాదాలు! నెల రోజుల వ్యవధిలో నలుగురు హీరోలకు గాయాలు, అభిమానుల్లో కలవరం!
- పవన్ కళ్యాణ్ కు శస్త్ర చికిత్స! రాజకీయ, సినిమా భవిష్యత్తుపై నీలినీడలు, జనసైనికుల్లో దిగులు!
- వరుణ్ తేజ్ ‘బరి’ షూటింగ్ లో ప్రమాదం! కాలికి గాయం, శస్త్ర చికిత్సతో అభిమానుల్లో ఆందోళన!
- రామ్ చరణ్ కంటికి గాయం, చిరంజీవి మోకాలికి ఆపరేషన్! మెగా హీరోలకి ఏమైంది? ఫాన్స్ టెన్షన్!
టాలీవుడ్ లో తీవ్ర విషాదం! మెగా ఫ్యామిలీ హీరోలు వరుసగా హాస్పిటల్ పాలవుతుండటం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. అసలు మెగా హీరోలకు ఏమైంది? ఎందుకు ఇలా జరుగుతోంది? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
మెగా ఫ్యామిలీలో వరుస ఆరోగ్య సమస్యలు
Mega Family : మెగా హీరోలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా హాస్పిటల్ పాలవుతున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నాలుగు నెలల్లోనే మెగా హీరోలు అంతా వరుసగా గాయాల పాలవడం, పలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలవడం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.
తాజాగా కొద్ది సేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు పరీక్షించి శస్త్ర చికిత్స చేసారని, పది రోజుల పాటు విశ్రాంతి త్రీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజకీయాల్లో, సినిమాల్లో చురుగ్గా ఉంటున్న పవన్ ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు అని తెలియడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఒక నాలుగు రోజుల క్రితం వరుణ్ తేజ్ బరి సినిమా షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కాలికి గాయం అయిందని, శస్త్ర చికిత్స చేసారని అధికారికంగానే తెలిపారు. కాలికి శస్త్ర చికిత్స జరిగిందని, ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్టు వరుణ్ తేజ్ ఇవాళే ప్రకటించాడు.
పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స
ఓ రెండు వారాల క్రితం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. ఏకంగా కంటి పై భాగానికి గాయం అయింది. చరణ్ కి కూడా ఆ గాయానికి చికిత్స చేసారు. కానీ చరణ్ ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ కి వచ్చేసారు.
నాలుగు నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవికి మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందని అధికారికంగానే చిరంజీవి వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ షూటింగ్, ప్రమోషన్స్ సమయంలో ఆయన కాలి నొప్పితో బాగా ఇబ్బంది పడ్డారని టాలీవుడ్ అంతా చర్చించుకుంది.
వరుసగా గాయాలపాలవుతున్న మెగా హీరోలు
ఇక కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ సమయంలో పలు ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసాడని, చికిత్స తీసుకొని కొన్ని రోజులు రెస్ట్ అనంతరం మళ్ళీ షూటింగ్ కి వెళ్లారని టాలీవుడ్ లో టాక్ నడిచింది.
ఇలా నాలుగు నెలల గ్యాప్ లోనే మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలంతా గాయాలపాలవడం, ఆసుపత్రి పాలవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మెగా ఫ్యామిలీకి ఏమైంది, అందరూ ఒకేసారి ఎఫెక్ట్ అవుతున్నారు అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ హాస్పిటల్ పాలవడం ఇప్పుడు చర్చగా మారింది.
మెగా హీరోలు త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఈ వరుస సంఘటనలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


