
📌 Key Points
- చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలోని ‘మీసాల పిల్లా’ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటింది.
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట కూడా అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది.
- చిరంజీవి చిత్రం సంక్రాంతికి విడుదల కాగా, రామ్ చరణ్ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- తండ్రీకొడుకులు తమ సినిమాల పాటల వ్యూస్‌లో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ రికార్డులు సృష్టిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలోని ‘మీసాల పిల్లా’ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ఆయన కుమారుడు రామ్ చరణ్ ‘చికిరి చికిరి’ పాటతో పోటీ పడుతూ దూసుకుపోతోంది. మెగా తండ్రీకొడుకుల మధ్య రికార్డుల యుద్ధం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
చిరంజీవి ‘మీసాల పిల్లా’ సృష్టించిన సంచలనం
Chiranjeevi vs Ram Charan: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSVPG)సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది .ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాకు కావలసినంత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే .అయితే మీసాల పిల్ల సాంగ్(Meesala Pilla Song) మాత్రం యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తుంది. ఈ పాట ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకోవడంతో చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇలా ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకోవడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ (Ramcharan)చికిరి చికిరి (Chikiri Chikiri)పాటకు పోటీగా దూసుకుపోతున్నారు.
రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ పాటకు అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుంది. ఇలా తండ్రి కొడుకులిద్దరూ తమ సినిమాల విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఇక చిరంజీవి నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాగా రామ్ చరణ్ సినిమా మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రామ్ చరణ్ సినిమాపై కూడా అభిమానులు భారీ స్థాయిలో అంచనాలను పెట్టుకున్నారు.
రామ్ చరణ్ ‘చికిరి చికిరి’ పాట దూకుడు
What a way to end the year❤️🔥 It’s 100MILLION+ VIEWS for #MeesaalaPilla 😍🔥
Team #ManaShankarVaraprasadGaru is grateful for making the MEGA GRACE the MOST CELEBRATED SONG OF THE SEASON ❤️🔥
— https://t.co/a0qcnnielF #MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.… pic.twitter.com/eWZ5p0WFPZ
యూట్యూబ్‌లో తండ్రీకొడుకుల రికార్డుల సమరం
— Gold Box Entertainments (@GoldBoxEnt) December 31, 2025
ఇక రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు ఈయన సెకండ్ ఇన్నింగ్స్ లో వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవి NIA అధికారిగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ క్యామియో పాత్రలో సందడి చేయనున్నారు. వెంకటేష్ పాత్ర దాదాపు 25 నిమిషాల పాటు ఉండబోతుందని అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో కూడా మాస్ సాంగ్ ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫుల్ సాంగ్ విడుదల చేయడంతో ఈ సాంగ్ కాస్త సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చింది.
ఈ ‘మీసాల పిల్లా’ పాటతో చిరంజీవి, ‘చికిరి చికిరి’ పాటతో రామ్ చరణ్ యూట్యూబ్‌లో తమ సత్తా చాటుతున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ మెగా అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి, రెండు సినిమాలపై అంచనాలను పెంచుతోంది.


