
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సక్సెస్ తో సుజీత్ కి కోటి రూపాయల డిపెండర్ కారు బహుమతిగా ఇచ్చారు.
- చిరంజీవి ‘MSVPG’ సినిమా 300 కోట్ల కలెక్షన్లతో అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.
- రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
- సక్సెస్ అయిన మెగా హీరోల సినిమాల దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతులుగా ఇస్తున్నారు.
సినిమా పరిశ్రమలో విజయాలు సాధించిన దర్శకులకు బహుమతులు ఇవ్వడం సాధారణం. పవన్ కళ్యాణ్, చిరంజీవి తమ దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతులుగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు రామ్ చరణ్ వంతు రానుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
సుజిత్ కు పవన్ కళ్యాణ్ బహుమతి
Mega Gifts: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి సక్సెస్ అయ్యింది అంటే నిర్మాత దర్శకుడికి లేదా హీరోలకు ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. అయితే చాలావరకు ఖరీదైన కార్లను బహుమతిగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు దర్శకులు కూడా నిర్మాతల నుంచి హీరోల నుంచి ఇలాంటి ఖరీదైన కార్లను కానుకగా అందుకుంటున్నారు. గత కొంతకాలంగా మెగా హీరోలకు సరైన సక్సెస్ లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వరుసగా మెగా హీరోలకు దర్శకులు వరుస హిట్ సినిమాలను అందిస్తున్న నేపథ్యంలో స్వయంగా హీరోలు దర్శకులకు ఖరీదైన కార్లను కానుకగా అందిస్తున్నారు.
మొన్నటికి మొన్న డైరెక్టర్ సుజిత్ (Sujith) కోసం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఏకంగా కోటి రూపాయల విలువచేసే డిపెండర్ కారును బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే. ఓజి సినిమా (OG Movie)సూపర్ సక్సెస్ కావడంతో పవన్ కళ్యాణ్ ఈ కానుకను అందించారు. ఓజి సినిమా కోసం సుజిత్ తన పాత డిపెండర్ కారును అమ్ముకున్న విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ తనకోసం కొత్త కారును బహుమానంగా అందించారు. దీంతో సుజిత్ తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటన మర్చిపోకముందే మెగా బాస్ చిరంజీవి(Chiranjeevi) మన శంకర వరప్రసాద్ గారు(MSVPG film) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
అనిల్ రావిపూడికి చిరంజీవి గిఫ్ట్
ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై 300 కోట్ల కలెక్షన్లను రాబట్టడంతో చిరంజీవి అనిల్ రావిపూడి కోసం రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును బహుమానంగా అందించారు. ఈ కారు ధర కూడా కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తోంది. ఇలా నిన్న పవన్ కళ్యాణ్ నేడు చిరంజీవి తమ డైరెక్టర్ కు ఖరీదైన కార్లను బహుమానంగా ఇచ్చి సర్ప్రైజ్ చేయడంతో నెక్స్ట్ కారు అందుకోబోతున్న మెగా డైరెక్టర్ ఎవరు? అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన పెద్ది సినిమా(Peddi Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా(Bucchibabu Sana) దర్శకత్వంలో పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కనుక పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అయితే కచ్చితంగా బుచ్చి బాబుకి కూడా రామ్ చరణ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. మరి నెక్స్ట్ బుచ్చిబాబు కారును కానుకగా అందుకుంటారా? లేదంటే పవన్ కళ్యాణ్ నుంచి హరీష్ శంకర్ కారును బహుమతిగా తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మెగా హీరోలు అద్భుతమైన కాస్ట్లీ గిఫ్ట్ లతో డైరెక్టర్లకు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బుచ్చిబాబుకి రామ్ చరణ్ గిఫ్ట్ ఎప్పుడు?
మెగా హీరోలు తమ దర్శకులను ప్రోత్సహించడానికి ఇలా ఖరీదైన బహుమతులు ఇవ్వడం అభినందనీయం. ఇది ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు రావాలని ఆశిద్దాం.


