|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా పవర్ స్టార్ ‘పెద్ది’ మాస్ రిలీజ్ డేట్.. అరాచకం సృష్టించే పోస్టర్ వైరల్!

Published: 01-05-2026, 11:19 AM
మెగా పవర్ స్టార్ 'పెద్ది' మాస్ రిలీజ్ డేట్.. అరాచకం సృష్టించే పోస్టర్ వైరల్!
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్! జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల.
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ వర్క్స్ మొత్తం విజయవంతంగా పూర్తి.
  • జాన్వీ కపూర్ హీరోయిన్‌గా భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
  • హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో అద్భుతమైన స్పెషల్ సాంగ్ చిత్రీకరణతో ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి.

మెగా ఫ్యాన్స్‌కు పండగే పండగ! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. అదిరిపోయే పోస్టర్‌తో మేకర్స్ ఇచ్చిన ఈ సూపర్ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్. జూన్ 4న థియేటర్లలో విధ్వంసం సృష్టించడానికి ‘పెద్ది’ సిద్ధంగా ఉంది.

జూన్ 4న ‘పెద్ది’ విధ్వంసం షురూ!

మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘పెద్ది’ రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు టీమ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. చిత్ర బృందం ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. జూన్ ప్రారంభంలో రిలీజ్ కావడం వల్ల సమ్మర్ హాలిడేస్ చివరి దశలో థియేటర్స్‌లో ప్రేక్షక ఆదరణ అందుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం అని భావించారు టీమ్.

ఇక హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో అద్భుతమైన స్పెషల్ సాంగ్ చిత్రీకరణను చిత్ర బృందం పూర్తి చేయడంతో అధికారికంగా ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి. ఈ ఎనర్జిటిక్ సాంగ్ ‘పెద్ది’ చిత్రంలోని మెయిన్ హైలెట్స్‌లో ఒకటిగా నిలవనుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌‌గా వేగంగా సాగుతుండటంతో డేట్ ప్రకటించారు మేకర్స్. ప్రజెంట్ ఈ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోతున్నాయి. కాగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో మ్యాజిక్

షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్పీడ్

‘పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.