
📌 Key Points
- రెహమాన్‌పై కంగనా ఫైర్: ద్వేషపూరిత వ్యాఖ్యలంటూ సంచలన ఆరోపణలు!
- బాలీవుడ్‌లో వివక్ష లేదన్న కంగనా.. షారుఖ్, సల్మాన్‌లను ఉదాహరణగా చూపింది!
- రెహమాన్ కామెంట్స్‌పై భగ్గుమన్న బాలీవుడ్ ప్రముఖులు.. మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు!
- సృజనాత్మకత లేని వారి చేతుల్లో అధికారం ఉందన్న రెహమాన్.. సంచలన ఆరోపణలు!
బాలీవుడ్ లో మరో సంచలనం! కంగనా రనౌత్, ఏఆర్ రెహమాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రెహమాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా స్పందించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
రెహమాన్ కామెంట్స్‌పై కంగనా కౌంటర్ ఎటాక్!
Kangana Ranaut: సినిమా ఇండస్ట్రీలో విభజనవాదాన్ని ప్రేరేపిస్తున్నారు అంటూ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తన మతం కారణంగా గతం పదేళ్లుగా పని దొరకడం లేదని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు రహమాన్. ప్రస్తుతం సృజనాత్మకత లేని వారి చేతిలో అధికారం ఉందని, తనను ఎంపిక చేసిన తరువాత వేరే వాళ్ళతో సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలణంగా మారింది.
బాలీవుడ్‌లో వివక్ష ఉందా? కంగనా ఏమన్నారంటే..
రహమాన్ చేసిన ఈ వివాదాస్పద కామెంట్స్ పట్ల దేశ ప్రజలు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు రహమాన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఈ లిస్టులో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, వీహెచ్పీ నేత వినోద్ బన్సల్ తదితరులు ఉన్నారు. రహమాన్ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రెహమాన్.. నేను కేవలం కాషాయ పార్టీకి మద్దతిస్తున్నానని తెలిసి సినీ పరిశ్రమలో నాపై ఎంతో వ్యతిరేకతను చూపించారు. కానీ, మీ అంత పక్షపాత, ద్వేషపూరితమైన వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది కంగన(Kangana Ranaut).
వైరల్ అవుతున్న రెహమాన్, కంగనా వార్!
బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉంది అనడం అవాస్తవం. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు ఇక్కడే కొనసాగుతున్నారు. రెహమాన్ లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. చిన్న నిర్మాతలు ఆయన దగ్గర వెళ్ళలేరు. మత పరమైన కారణాలు కాదు’ అంటూ జావేద్ అక్తర్ చెప్పుకొచ్చాడు. దీంతో, రహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి.
రెహమాన్ మరియు కంగనా మధ్య జరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


