|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్! బాబీ డైరెక్షన్‌లో దురంధర్ బ్యూటీ ఫిక్స్.. రికార్డ్స్ బ్రేక్ పక్కా!

Published: 04-02-2026, 1:35 AM
మెగాస్టార్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్! బాబీ డైరెక్షన్‌లో దురంధర్ బ్యూటీ ఫిక్స్.. రికార్డ్స్ బ్రేక్ పక్కా!
  • చిరంజీవి, బాబీ కాంబో మూవీ ‘మెగా 158’లో సారా అర్జున్!
  • ‘దురంధర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సారా అర్జున్
  • ప్రియాంక అరుళ్ మోహన్‌ను తప్పించిన మేకర్స్
  • మోహన్ లాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరవనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ‘మెగా 158’ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో దురంధర్ బ్యూటీ సారా అర్జున్ నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

బాబీతో చిరు మూవీ: క్రేజీ అప్‌డేట్!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దీనిని దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో తెరకెక్కించగా, చిరంజీవి సరసన నయనతార(Nayanathara) జంటగా నటించారు. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. నిర్మాణ పరంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి(Sahu Garapati), సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ అన్ని కలిసి సినిమాకు కమర్షియల్ టచ్ ఇచ్చాయి. అలా ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇక చిరంజీవి ప్రజెంట్ ‘విశ్వంభర’(Viswambhara) మూవీతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు వశిష్ఠ(Vasista) తెరకెక్కిస్తున్న విజువల్ ఫాంటసీ ఇప్పటికే అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తి చేసుకుంది. వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా ఆలస్యమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్రిష(Trisha) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అలాగే ఇందులో యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

దురంధర్ బ్యూటీ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!

ఈ సినిమాతో పాటు చిరు బాబీ(Bobby Kolli) దర్శకత్వంలో తన నెక్స్ట్ చిత్రం ‘మెగా 158’ (Mega 158) కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేవీఎన్(KVN Productions) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. నారాయణ(K. Narayana) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియమణి(Priyamani) కథానాయికగా యాక్ట్ చేస్తుంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే మొన్నటి వరకు చిరంజీవికి కూతురుగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం రాగా.. ఇప్పుడు ‘దురంధర్’(Durandhar) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సారా అర్జున్(Sara Arjun) నటించబోతున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రియాంక అరుళ్ మోహన్ అవుట్.. సారా అర్జున్ ఇన్!

దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్(Ranveer Singh) హీరోగా నటించిన ‘దురంధర్’ సినిమా గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆదిత్య ధర్(Aditya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి విదితమే.

చిరంజీవి, బాబీ కాంబో మూవీలో సారా అర్జున్ ఎంట్రీతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మెగా ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.