|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ మనసు వెన్న.. కళ్లు లేని పాపకు లక్ష్మీ కటాక్షం! చిరు దాతృత్వంపై ఫ్యాన్స్ ఫిదా!!

Published: 10-01-2026, 2:15 AM
మెగాస్టార్ మనసు వెన్న.. కళ్లు లేని పాపకు లక్ష్మీ కటాక్షం! చిరు దాతృత్వంపై ఫ్యాన్స్ ఫిదా!!
  • సరిగమప లిటిల్ ఛాంప్స్ కంటెస్టెంట్ వరుణవికి సహాయం చేసిన చిరంజీవి.
  • రూ. 5 లక్షల చెక్కును వరుణవి కుటుంబానికి అందజేసిన సుస్మిత కొణిదెల.
  • చిరంజీవి చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపిన వరుణవి తల్లిదండ్రులు.
  • అనిల్ రావిపూడి ప్రోమోలో చిరంజీవి వరుణవికి సహాయం చేస్తానని మాట ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సరిగమప లిటిల్ ఛాంప్స్ షోలో కంటి చూపు లేని వరుణవికి ఆర్థిక సహాయం చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

చిరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు!

జీ తెలుగులో ప్రసార మయ్యే సరిగమప లిటిల్ ఛాంప్స్ షో అందరికీ తెలిసిందే. అయితే ఆ కాంపిటీషన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ వరుణవి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాపకు కళ్లు లేనప్పటికీ తన గాత్రంతో అందరినీ ఫిదా చేస్తుంది. తన స్వీట్ వాయిస్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఈ చిన్నారికి సీజన్ ఎండింగ్ వరకు ఎలిమినేషన్ లేకుండా పాడే చాన్స్ ఇవ్వడం విశేషం. ఇక సరిగమప లిటిల్ ఛాంప్స్ షోకు డైరెక్టర్ అనిల్ రావిపూడి, సింగర్ శైలజ, అనంత్ శ్రీరామ్ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. సుధీర్ యాంకరింగ్ చేస్తున్నాడు.

అయితే రీసెంట్‌గా టెలికాస్ట్ అయిన ప్రోమోలో వరుణవిను చిరంజీవితో మీట్ అయ్యో చాన్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కల్పించిన సంగతి తెలిసిందే. అప్పుడు చిరు ఈ పాపను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆమెకు నా నుంచి ఎటువంటి సహాయం చేయడానికి అయినా రెడీ అని మాట ఇస్తాడు. ఇక ఇచ్చిన మాటను తాజాగా చిరంజీవి నిలబెట్టుకున్నాడు. సరిగమప లిటిల్ ఛాంప్స్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి కూతురు సుస్మిత హాజరైంది.

వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం!

ఇదే సందర్భంగా ఆమె చేతుల మీదుగా వరుణవి ఫ్యామిలీకి రూ.5 లక్షల చెక్కును ఇప్పించారు చిరంజీవి. మెగాస్టార్ పంపించిన డబ్బును వరుణవి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు సుస్మిత తెలిపారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం తన కూతురు చేతుల మీదుగానే ఈ బహుమతిని చిరంజీవి పంపించారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో జీ తెలుగు తాజాగా రిలీజ్ చేసింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మనసున్న మారాజు మా చిరంజీవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి గొప్ప మనసుపై నెటిజన్ల ప్రశంసలు!

A post shared by Zee Telugu (@zeetelugu)

చిరంజీవి తన దాతృత్వంతో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి వరుణవికి సహాయం చేసి మరోసారి తన గొప్ప మనసును నిరూపించుకున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.