|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వంభర: ‘విశ్వంభర’ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్.. వీడియో వైరల్.. రిలీజ్ ఎప్పుడంటే..

Published: 21-08-2025, 12:11 AM
విశ్వంభర: ‘విశ్వంభర’ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్.. వీడియో వైరల్.. రిలీజ్ ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటించిన విశ్వంభర సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమా 2026 వేసవిలో విడుదల కానుంది. చిరంజీవి ఈ సినిమా గురించి ఓ వీడియోలో వివరించారు.

Key Points

1

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర సినిమా గ్లింప్స్ విడుదల.

2

సినిమా రిలీజ్ 2026 వేసవిలో.

4

చిరంజీవి ఈ సినిమాను చిన్నపిల్లలు, పెద్దలు ఆనందిస్తారని పేర్కొన్నారు.

చిరంజీవి పుట్టినరోజు కానుకగా విశ్వంభర గ్లింప్స్

Vishwambhara : రేపు ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అని అందరికి తెలిసిందే. అసలే ఈసారి 70వ పుట్టిన రోజు కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ పండగను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేసారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.(Vishwambhara)

ఈ రెండు సినిమాల నుంచి స్పెషల్ అప్డేట్స్ మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు. నిన్నే చిరంజీవి నేడు మెగా బ్లాస్ట్ రాబోతుంది అని హింట్ ఇచ్చారు. తాజాగా చిరంజీవి విశ్వంభర సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

2026 వేసవిలో విశ్వంభర సినిమా విడుదల

ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. చాలా మందికి డౌట్ ఉంది ఈ సినిమా ఎందుకు డిలే అవుతుంది అని. ఈ ఆలస్యం చాలా సముచితం అని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్, VFX మీదే ఆధాపడి ఉంది. ది బెస్ట్ క్వాలిటితోటి మీ ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతల ఆశయమే ఈ ఆలస్యానికి కారణం. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధ శక్తులతో తీసుకుంటున్న సమయం ఇది.

వీడియో వైరల్ గా మారింది

ఇది ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలకు వాళ్ళను సైతం ఇది అలరిస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మీకు, నాకు యువీ క్రియేషన్ వాళ్ళు చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందే అంటే నేడు సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. గ్లింప్స్ వస్తుంది, అది మనల్ని అలరిస్తుంది. ఈ సినిమాని 2026 వేసవిలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. నాది భరోసా అని తెలిపారు. దేంతో నేడు సాయంత్రం రాబోయే విశ్వంభర గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

చిరంజీవి భరోసాతో, 2026 వేసవిలో విడుదల కానున్న విశ్వంభర సినిమాపై అంచనాలు పెరిగాయి. గ్లింప్స్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.