
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని, అందులో చిరంజీవితో కన్నడ బ్యూటీ నిష్విక నాయుడు నటించనున్నారని తెలుస్తోంది.
Key Points
చిరంజీవి 'విశ్వంభర' సినిమాకు కొత్త అప్డేట్!
కన్నడ బ్యూటీ నిష్విక నాయుడుతో స్పెషల్ సాంగ్!
సినిమా షూటింగ్ త్వరలో పూర్తయ్యే అవకాశం!
విశ్వంభర సినిమాకు కొత్త అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ (Vishvambhara). సోషియో-ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వశిష్ట (Director Vashishta) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే.. ‘విశ్వంభర’ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ.. సినిమా నుంచి ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే రేంజ్‌లో ఏ ఒక్క అప్డేట్ రాలేదు. దీంతో అసలు సినిమా షూటింగ్ జరుగుతుందా.. ఆగిపోయిందా అనే డైలామాలో పడ్డారు అభిమానులు. ఈ క్రమంలోనే ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందులో చిరు పక్కన మాస్ స్టెప్పులు వెయ్యడానికి కన్నడ బ్యూటీ నిష్విక నాయుడు(Nishvika Naidu)ని ఎంపిక చేశారట. అంతే కాకుండా.. ఈ సాంగ్‌తో సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కానుందని తెలుస్తుండగా.. దీని నుంచి త్వరలో వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు ఫుల్ జోష్‌లో ఉన్నారట మేకర్స్.
నిష్విక నాయుడుతో స్పెషల్ సాంగ్
ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం
చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తోంది. నిష్విక నాయుడుతో స్పెషల్ సాంగ్ తో సినిమా త్వరలోనే పూర్తవుతుందని ఆశిద్దాం.


