
📌 Key Points
- భారతీరాజా మరణంపై సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.
- చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్.
- ‘ఆరాధన’ సినిమాలో చిరుకు అవకాశం ఇచ్చింది భారతీరాజా.
- భారతీరాజా సేవలు భారతీయ సినిమాకు వెలకట్టలేనివి.
సినీ ప్రపంచంలో విషాదం నెలకొంది! దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతితో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాలు తెలుసుకోండి!
చిరుకు భారతీరాజా ఇచ్చిన అరుదైన అవకాశం!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా తుదిశ్వాస విడిచారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రా రూపొందించిన ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం జూన్10న తెల్లవారుజామున కన్నమూశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.. “భారతీయ సినిమా రంగం ఓ గొప్ప దర్వకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను సినిమాగా మలిచి మనకు అందించారు.
ప్రతిష్టాత్మక పద్మశ్రీ, అనేక జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్న భారతీరాజా గారి సేవలు భారతీయ సినిమాకు వెలకట్టలేనివి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆరాధన’ సినిమాలో ‘పులిరాజు’ పాత్రలో నటించే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకున్న అమితమైన ఇష్టం, ఆయన సరళత, తన పని పట్ల ఆయన చూపించే అంకితభావం నాపై ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశాయి” అని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. అలాగే ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, భారతీరాజా గారు సృష్టించిన అద్భుతమైన క్లాసిక్ చిత్రాల ద్వారా ఆయన లెగసీ ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని అన్నారు. తమిళ సినీ రంగంలో ‘ఇయక్కునర్ ఇమయమ్’ గా పిలవబడే భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని రాసుకొచ్చారు.
మెగాస్టార్ లో చెరిగిపోని ముద్ర వేసిన భారతీరాజా!
లెగసీ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది: చిరంజీవి
భారతీరాజా గారి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ సినీ ప్రియులను కదిలించింది. మరిన్ని సంచలన వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను అనుసరించండి!


