
ఓటీటీ అభిమానులకు ఈ వారం పండగే. రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకే రోజు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కాంతార, మలయాళం సూపర్ హీరో లోక చిత్రాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. వీటి స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Key Points
ఒకే రోజు రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి.
కాంతార: కన్నడ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్.
లోక (కొత్త లోక): మలయాళం సూపర్ హీరో మూవీ, ₹300 కోట్లకు పైగా వసూళ్లు.
లోక అక్టోబర్ 31 నుండి జియోహాట్‌స్టార్‌లో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ వారం ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లు
ఓటీటీలోకి ఈవారం ఒకే రోజు రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఒకటి మలయాళం సూపర్ హీరో సినిమా కాగా.. మరొకటి కన్నడ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. మరి వీటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
ఈవారం ఓటీటీ అభిమానులకు పండగే. ఎందుకంటే ఈ ఏడాది ఇండియన్ సినిమాలో రెండు అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ ప్రీమియర్ కాబోతున్నాయి. వీటిలో ఒకటి కాంతార ఛాప్టర్ 1 కాగా.. మరొకటి మలయాళం మూవీ లోకా: ఛాప్టర్ 1. ఈ రెండు మూవీస్ వేర్వేరు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి.
కాంతార, లోక: డిజిటల్ ప్రీమియర్ వివరాలు
ఒక్క రోజు.. రెండు బ్లాక్‌బస్టర్లు..
ఇక మరొకటి మలయాళం ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్ల సూపర్ హీరో మూవీ లోకా: ఛాప్టర్ 1. తెలుగులో కొత్త లోక పేరుతో రిలీజైంది. కల్యాణి ప్రియదర్శన్ ఫిమేల్ సూపర్ హీరో పాత్ర పోషించింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి.. ఈ ఘనత సాధించిన తొలి మలయాళం మూవీగా నిలిచింది. ఇప్పుడీ సినిమా శుక్రవారం (అక్టోబర్ 31) నుంచే జియోహాట్‌స్టార్ లో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మలయాళం, కన్నడ బాక్సాఫీస్ సంచలనాలు
కాంతార, లోకా.. రెండూ రెండే
ఈ రెండు సినిమాలూ తెలుగులోనూ థియేటర్లలో రిలీజై.. ఇక్కడా వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో ఈ రెండు మూవీస్ డిజిటల్ ప్రీమియర్ పై ఎంతగానో ఆసక్తి నెలకొంది. అయితే ఒకే రోజు ఇవి రెండూ రానుండటం మాత్రం సినిమా లవర్స్ కు ఓ పండగలాంటి వార్తే అని చెప్పొచ్చు.
థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన కాంతార, లోక చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో అలరించనున్నాయి. ఒకే రోజు ఈ రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లు డిజిటల్ ప్రీమియర్ కానుండటం సినీ ప్రియులకు ఒక గొప్ప శుభవార్త. ఈ వారం డిజిటల్ వినోదం పక్కా!


