|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ చిరంజీవి సంచలన లైనప్: 3 ఏళ్లలో 4 బ్లాక్‌బస్టర్లు ఖాయమా?

Published: 12-05-2026, 5:01 PM
మెగాస్టార్ చిరంజీవి సంచలన లైనప్: 3 ఏళ్లలో 4 బ్లాక్‌బస్టర్లు ఖాయమా?
  • చిరంజీవి లైనప్‌లో వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ ఆగస్ట్ 15న రానుంది.
  • ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు 158వ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.
  • ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో నాని నిర్మాణంలో చిరంజీవి ‘రా’ మాస్ లుక్‌లో కనిపించనున్నారు.
  • మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో కలిసి ట్రెండ్ సెట్టర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు.

చిరంజీవి లైనప్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. మూడు ఏళ్లలో నాలుగు సంచలన చిత్రాలతో మెగాస్టార్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. వశిష్ట, బాబీ కొల్లి, శ్రీకాంత్ ఓదెల వంటి యువ దర్శకులతో ఆయన చేస్తున్న ప్రాజెక్టులు అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ క్రేజీ లైనప్ వివరాలు ఇక్కడ చూడండి.

విశ్వంభర: చిరంజీవి సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్

Chiranjeevi Lineup : చిరంజీవి….ఇది ఒక పేరు కాదు ఒక ట్రెండ్ సెట్టర్. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ బిగ్ బాస్ గా సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తున్నా ఇప్పటికీ యంగ్ డైరెక్టర్స్ కి ఆయనే టార్గెట్ అంటే వారి థాట్ ప్రాసెస్ కి తగ్గట్టుగా తనని తాను ఎలా మేకోవర్ చేసుకుంటున్నాడో అర్థం అవుతుంది. ఇక ఈ క్రమంలోనే పలు యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ లిచ్చిన చిరు లైనప్ చూస్తుంటే టాలీవుడ్‌లో గూస్ బంప్స్ రావడం ఖాయం.

ఈ క్రేజీ లైనప్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది ‘విశ్వంభర’ గురించి. ‘బింబిసార’ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నయంగ్ ఫిలిం మేకర్ వశిష్ట మేకింగ్ స్టైల్ నచ్చి చిరంజీవి ఈ సోషియో ఫాంటసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి కూడా. అయితే అనుకోని కారణాల వల్ల రిలీజ్ డేట్ అటు ఇటుగా అవుతున్నా కూడా సినిమాపై ఉన్న ఆ అంచనాలు అదే స్థాయిలో కంటున్యూ కావడం విశేషం. ఇక వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ 15న వస్తుందని సమాచారం.

బాబి కొల్లి చేతిలోనే తన 158వ సినిమా

ఇక ఈ సినిమా సంగతి ఇలా ఉంటె ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ మళ్ళీ బాబి కొల్లి చేతిలోనే తన 158వ సినిమాని పెట్టిన సంగతి తెల్సిందే.ఇక ఇందులో వింటేజ్ చిరంజీవిని ‘వాల్తేరు వీరయ్య’లో ఎలాగైతే చూపించారో, అంతకు మించిన పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని ఇన్ సైడ్ టాక్ .ఇక ఈ మధ్యే చిరుకి లుక్ టెస్ట్ చేశామంటూ బాబీ పోస్ట్ పెట్టాడు కూడా.మొత్తానికి బాబి సిద్ధం చేసిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉండబోతోందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

బాబీ దర్శకత్వంలో మరో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్

మరో సినిమా ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో

ఇక చిరు లైనప్ లో ఉన్న మరో సినిమా ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చేయబోయేది. ఇక నాని ప్రొడ్యూస్ చేయబోతున్న ఈ సినిమా అంటూ చేసిన అనౌన్స్‌మెంట్‌తోనే ఈ కాంబినేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపొయింది. శ్రీకాంత్ ఓదెల తన మార్క్ ‘రా’ స్టైల్ మేకింగ్‌తో 30 ఏళ్ల క్రితం నాటి ‘రాక్షసుడు’ వంటి కల్ట్ మాస్ లుక్‌లో చిరంజీవిని చూపించబోతున్నాడట. ఇక ప్యారడైజ్ కాగానే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.

చిరంజీవిని కలిసి కథ వినిపించిన తరుణ్ మూర్తి

శ్రీకాంత్ ఓదెలతో చిరు ‘రా’ మాస్ లుక్

ఇక ఇవన్ని ఇలా ఉంటె ఈ లైనప్ మరో సినిమా రాబోతుందన్న వార్తలు ఇపుడు మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాయి. యస్ ..మలయాళీ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ మూర్తి ..అదే నండి. ‘ఆపరేషన్ జావా’, ‘సౌదీ వెళ్ళక్క’ వంటి సినిమాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ క్రేజీ ఫిలిం మేకర్ ఈ మధ్యే చిరంజీవిని కలిసి కథ వినిపించారన్న వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. ఇది ఏదైనా మలయాళ రీమేక్ అవుతుందా లేక స్ట్రెయిట్ సినిమానా అన్నది పక్కన పెడితే, తరుణ్ మూర్తి సినిమాల్లో ఉండే ఇంటెన్సిటీ చిరంజీవి మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచడం ఖాయం. మలయాళ సినిమాల్లో ఉండే న్యాచురాలిటీ చిరంజీవి నటనలో తోడైతే వెండితెరపై మ్యాజిక్ జరగడం పక్కా.

మొత్తంగా ఈ లైనప్ చూస్తుంటే మెగాస్టార్ క్యాలెండర్ వచ్చే మూడేళ్ల వరకు పక్కాగా లాక్ అయిపోయినట్లే కనిపిస్తోంది.ఏది ఏమైనా ఏడు పదులు దాటినా ఈ స్థాయి లైనప్ సెట్ చేస్తు మెగాస్టార్ మళ్ళీ ఐయాం ది వన్ అండ్ ఓన్లీ అని మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు. చూడాలి మరి చిరుని చూసి కుర్ర హీరోలేమైనా స్పీడ్ పెంచుతారో !

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో కలిసి కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ, తన కెరీర్‌లో మరో అద్భుతమైన అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం అనడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.