
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవిని కలవలేక కన్నీళ్లు పెట్టుకున్న వీరాభిమాని పులి సీత కల ఎట్టకేలకు నెరవేరింది.
- ‘సమయం’ కథనం ద్వారా విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే పులి సీతను తన ఇంటికి ఆహ్వానించారు.
- తన అభిమాన హీరోకు చిరు ఇష్టదైవం హనుమాన్ ఫోటో ఫ్రేమ్‌ను కానుకగా ఇచ్చి సంతోషం పంచుకుంది.
- మెగాస్టార్ ఆత్మీయ ఆతిథ్యం, పులి సీత సంతోషం చూపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఒక అద్భుతమైన వార్త! మెగాస్టార్ చిరంజీవి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. ఒక వీరాభిమాని కల నెరవేర్చడానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
పులి సీత కన్నీళ్లు.. చిరు మనసు కరిగిన క్షణం!
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుందేమో కానీ, చిరంజీవిని కలవడం అంత ఈజీ కాదంటూ సినీ నటి పులి సీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చి పదకొండేళ్లు దాటినా, తన అభిమాన హీరోని కలవలేకపోయానని ఎమోషనల్ అయిన ఆమె.. ఎట్టకేలకు మెగాస్టార్ ని కలిసింది. ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. చిరు కానుకను అందించి మురిసిపోయింది. తన కోరిక నెరవేరిందంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది సీత. రీల్స్ రాణిగా పాపులర్ అయిన పులి సీత.. మెగా బ్రదర్స్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు వీరాభిమాని. మెగా ఫ్యామిలీని ఎవరన్నా దూషించినా, చిరు గురించి తప్పుగా మాట్లాడినా, పొలిటికల్ గా పవన్ పై ఏమన్నా కామెంట్స్ చేసినా.. వెంటనే దానికి రియాక్ట్ అవుతుంది. కౌంటర్ గా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. చిన్నప్పటి నుంచి తాను ఎంతగానో ఆరాధించే చిరంజీవిని మీట్ అవ్వాలనే తన మనసులోని కోరికను పలు సందర్భాల్లో సీత వెల్లడించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మరోసారి మాట్లాడింది. పులి సీత మాట్లాడుతూ.. చిరంజీవిని కలవడానికి ఎంతగానో ప్రయత్నించానని, ఆయన్ని కలిసే అదృష్టం మాత్రం తనకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన అభిమాన హీరోని కలిసే అవకాశం భగవంతుడు తనకు కల్పించలేదంటూ భావోద్వేగానికి గురైంది. మెగాస్టార్ ని కలవాలనే తన కుమారుడి కోరికను కూడా తీర్చలేకపోయానని ఎమోషనల్ అయింది. గతంలో చిరంజీవిని మీట్ అవ్వడానికి ప్రయత్నించినా, ఆయన కింద ఉండేవారు కనికరించలేదని చెప్పింది. దీనిపై ‘సమయం తెలుగు’ ఓ కథనం ప్రచురించింది . ఇది వైరల్ అయింది. మీడియా మిత్రులు ‘సమయం’ కథనాన్ని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. టీంతో చెప్పి పులి సీతని తన ఇంటికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆమె చిరుని కలిశారు. ఈ సందర్భంగా తన ఫేవరేట్ హీరోకి ఓ ఫోటో ఫ్రేమ్ ని బహుమతిగా అందించారు. ఆయన ఇష్టదైవమైన హనుమాన్ ఫోటోని ముద్రించిన ఈ ఫ్రేమ్ చిరంజీవిని ఆకట్టుకుంది. గిఫ్ట్ ఏదైనా దాని విలువ ఇచ్చేవాళ్ల మనసు, వారి ప్రేమపై ఆధారపడి ఉంటుందని.. తన ఇష్టమైన హనుమాన్ ఫోటో ఇవ్వడాన్ని తాను దీవెనలుగా భావిస్తున్నానని సీతతో చిరు అన్నారు. ఇది చాలా మంచి గిఫ్ట్ అని, తన హృదయానికి దగ్గరైన బహుమతి అందించావని ఆమెకు థ్యాంక్స్ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by P seethamahalakshmi (@puli.seetha) చిరంజీవిని కలిసిన తర్వాత ఈ వీడియోని పులి సీత సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి అభిమానించిన మెగాస్టార్ ని మీట్ అయినందుకు హ్యాపీగా ఉందని చెప్పింది. చిరు తనని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారని, ఇది తన లైఫ్ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అంటూ ఖుషీ అయింది. ఎవరైనా నిస్వార్థంగా ఒక మనిషిని అభిమానిస్తే, భగవంతుడే ఆ మనిషి దగ్గరకు తీసుకెళ్తాడని తనకు అర్థమైందని పేర్కొంది. నాలుగు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తూ, ‘టాలీవుడ్ మెగాస్టార్’గా వెలుగొందుతున్న చిరంజీవి.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన్ని ఒక్కసారైనా కలవాలని, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని, కలిసి ఫోటో దిగాలని ప్రతీ ఒక్క మెగాభిమాని కోరుకుంటాడు. అలానే ఇప్పుడు పులి సీత కూడా తన కోరికను నెరవేర్చుకుంది. డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సీత.. ‘జయ జానకి నాయక’, ‘F 3’, ‘వినయ విధేయ రామ’, ‘దేవర’ వంటి సినిమాల్లో నటించింది. లేటెస్టుగా వచ్చిన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ కు తల్లి పాత్రలో కనిపించింది.
మెగాస్టార్ ఇంటికి పులి సీత.. అద్భుతమైన అనుభవం!
చిరుకు అరుదైన బహుమతి.. ఫ్యాన్ ప్రేమకు నిదర్శనం!
మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పట్ల చూపిన ఈ ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తలు, అప్డేట్స్ కోసం మా ఛానెల్ ను చూస్తూనే ఉండండి!


