
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక మరికొన్ని రోజుల్లోనే చిరంజీవి, దర్శకుడు బాబి కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు, అందులో భాగంగా ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అన్ని అనుకూలంగా జరిగితే ఈ చిత్రంలో అనిల్ కపూర్ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ కపూర్ మధ్య మంచి స్నేహబంధం ఉన్న నేపథ్యంలో, ఈ సినిమాలో నటించేందుకు అనిల్ కపూర్ ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


