
📌 Key Points
- చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత ఫుల్ ఫన్, యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించడం ట్రైలర్ హైలైట్.
- చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తొలి చిత్రం, అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
- నయనతారతో చిరు ఫన్నీ రొమాన్స్, అనిల్ మార్క్ కామెడీ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి.
- విక్టరీ వెంకటేష్ సర్‌ప్రైజ్ ఎంట్రీ, చిరంజీవితో కలిసి చెప్పిన డైలాగ్స్ అదనపు ఆకర్షణ.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఫన్, యాక్షన్, వెంకటేష్ సర్ ప్రైజ్ ఎంట్రీతో అంచనాలను పెంచింది. ఈ సినిమా పండక్కి బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందో లేదో చూడాలి.
చిరంజీవి మార్క్ కామెడీ & యాక్షన్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం మరికొన్ని రోజుల్లో సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. చిరు, అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. దీనితో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అంతా ఊహించినట్లుగానే చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత ఫుల్ ఫన్ అండ్ యాక్షన్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ట్రైలర్ ప్రారంభం కాగానే చిరంజీవి పాత్రని ఫన్నీగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్.. ఎలాంటి క్రిమినల్ అని అయినా ఉతికి పిండి ఆరేస్తారు.. తప్పు చేసినోడిని కోసి కారం పెడతారు అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఉతికి ఆరేస్తారు అని అన్నపుడు చిరంజీవి బట్టలు ఉతుకుతూ కనిపించడం.. కోసి కారం పెడతారు అన్నప్పుడు వంకాయల కోయడం చూపించారు.
అనిల్ రావిపూడి వినోదం, నయనతారతో రొమాన్స్
దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు చిరంజీవి పాత్రలో అనిల్ రావిపూడి ఎంత ఫన్ జోడించారో అని. మన శంకర వరప్రసాద్ గారు అని చెప్పగానే చిరు తన స్టైల్ లో యాక్షన్ అవతారంలో చెలరేగిపోతున్నారు. గ్యాంగ్ లీడర్ తరహాలో వినిపిస్తున్న బీజీయం కూడా అదిరిపోయింది. భీమ్స్ చాలా కొత్తగా ఆ బీజీయం ని ప్రజెంట్ చేస్తున్నారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
ఆ తర్వాత నయనతారతో ఫన్నీ రొమాన్స్, భార్య భర్తలు అయ్యాక జరిగే గోడలని అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో చూపించారు. శత్రువులని చిత్తు చేసే శంకర వరప్రసాద్.. భార్య ముందు మాత్రం పిల్లిలా అయిపోతున్నాడు. చిరంజీవి నయనతారని.. శశి నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్ బ్లాక్ చేయవా ప్లీజ్ అని అడుక్కోవడం ఫన్నీగా ఉంది.
వెంకటేష్ సర్‌ప్రైజ్: బ్లాక్‌బస్టర్‌కి బాటలు?
ట్రైలర్ చివర్లో విక్టరీ వెంకటేష్ ఇచ్చిన ఎంట్రీ, చిరంజీవితో కలిసి చెప్పిన ఫన్నీ డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. హెలికాఫ్టర్ లో వెంకీ ఎంట్రీ ఇస్తారు. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావ్ ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావ్ ఏంటి అని చిరంజీవి అడగగా.. మాస్ కే బాస్ లా ఉన్నావ్ నువ్వు ఫ్యామిలీ రాలేదా అని వెంకీ కౌంటర్ ఇవ్వడం దానికి చిరంజీవి ఇచ్చిన రియాక్షన్ భలేగా ఉంటాయి. మొత్తానికి అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతికి పసందైన విందు రెడీ చేశారు. పండక్కి బ్లాక్ బస్టర్ అయ్యే స్టఫ్ మొత్తం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే బ్లాక్ బస్టర్ కొట్టేసినట్లే.
మొత్తానికి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ సంక్రాంతికి ఒక పసందైన వినోదాన్ని అందిస్తుందని స్పష్టం చేస్తోంది. చిరంజీవి మార్క్ కామెడీ, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.


