|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మైఖేల్ జాక్సన్: బతికున్నప్పుడు అప్పుల ఊబి.. చనిపోయాక వేల కోట్ల ఆస్తి!

Published: 14-04-2026, 12:05 PM
మైఖేల్ జాక్సన్: బతికున్నప్పుడు అప్పుల ఊబి.. చనిపోయాక వేల కోట్ల ఆస్తి!
  • మైఖేల్ జాక్సన్ మరణించే సమయానికి 5000 కోట్ల అప్పులు ఉన్నాయి.
  • ఆయన మరణం తర్వాత ఎస్టేట్ విలువ 18 వేల కోట్లకు చేరింది.
  • రాయల్టీ, మ్యూజిక్ డీల్స్ ద్వారా ఆదాయం వస్తోంది.
  • అప్పుల కారణంగా వేలం వేయాల్సిన నెవర్‌ల్యాండ్ రాంచ్ ఇప్పుడు లాభదాయకంగా ఉంది.

ప్రపంచ పాప్ ఇండస్ట్రీని ఏలిన మైఖేల్ జాక్సన్ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఆయన బతికున్నప్పుడు అప్పుల్లో ఉన్నా, చనిపోయాక వేల కోట్ల ఆస్తికి ఎలా అధిపతి అయ్యారో తెలుసుకుందాం.

మైఖేల్ జాక్సన్ ఆర్థిక పరిస్థితి – ఒక విశ్లేషణ

Michael Jackson : మైఖేల్ జాక్సన్… వరల్డ్ పాప్ ఇండస్ట్రీని ఒంటి చేత్తో ఏలి, మూన్ వాక్‌తో కోట్ల మందిని ఉర్రూతలూగించిన ఈ పాప్ కింగ్ ని పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన సాంగ్స్ అండ్ స్టెప్స్ తో కోట్లాది అభిమానులని సంపాదించుకున్న మైఖేల్ జాక్సన్ లైఫ్ నిజంగా ఒక అద్భుతం. అయితే, ఆయన దగ్గరున్న డబ్బెంత, ఆయన చేసిన అప్పెంత అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. నిజంగా బతికున్నప్పుడు అప్పుల ఊబిలో మునిగి, చనిపోయాక వేల కోట్ల ఆస్తికి అధిపతిగా మారడం జాక్సన్ కే సాధ్యమైంది.

దాదాపు 50 కోట్ల డాలర్ల అప్పు

2009 జూన్ 25న ఆయన మరణించే సమయానికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా.. ఆయనపై దాదాపు 50 కోట్ల డాలర్ల అప్పు ఉందంటే మీరు నమ్ముతారా.. యస్.. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే సుమారు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయల అప్పు ఆయన పేరు మీద ఉంది. ఒకవైపు స్టేజ్‌పై వేల కోట్లు సంపాదించినా, లగ్జరీ లైఫ్, నెవర్‌ల్యాండ్ రాంచ్ లాంటి భారీ ఎస్టేట్ల నిర్వహణ, ఖరీదైన కళాఖండాల కలెక్షన్స్, దానధర్మాలు అంటే సంపాదనకి మించి ఖర్చు చేసుకుంటూ పోయాడు మైకేల్. అది ఎంతలా అంటే చనిపోయే ఆఖరి రోజుల్లో ఆ అప్పులపై వచ్చే వడ్డీ కట్టడమే ఆయనకు ఒక పెద్ద నరకంలా మారిపోయెంత.

మరణానంతరం ఆస్తులు ఎలా పెరిగాయి?

అయితే మైఖేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందండోయ్.. ఆయన మరణానంతరం ఎస్టేట్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఇంటిలిజెంట్ డిసీషన్స్ తో జాక్సన్ బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. అవును.. అలా నేడు ఆయన ఎస్టేట్ విలువ సుమారు 200 కోట్ల డాలర్లు , అంటే అక్షరాల రూ. 18 వేల కోట్లకు పైమాటే మరి. అలా చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలుస్తున్నారంటే ఆయన మ్యూజిక్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

రాయల్టీ రూపంలో కోట్లాది రూపాయలు

సోనీ మ్యూజిక్ గ్రూప్‌తో జరిగిన భారీ డీల్స్, ‘MJ: ది మ్యూజికల్’ వంటి బ్రాడ్‌వే షోలు మరియు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా రెగ్యలర్ గా రాయల్టీ రూపంలో కోట్లాది రూపాయలు వచ్చి చేరుతున్నాయి. ఒకప్పుడు అప్పుల కారణంగా వేలం వేయాల్సిన పరిస్థితి వచ్చిన నెవర్‌ల్యాండ్ రాంచ్, ఆయన ఆర్థిక పతనానికి గుర్తుగా నిలిస్తే, నేడు ఆయన సృష్టించిన మ్యూజిక్ మాత్రం కాసుల వర్షం కురిపిస్తోందన్న మాట.

కొంత భాగాన్ని చారిటీ సంస్థలకు కూడా

సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానం

ఇక ఈ వేల కోట్ల ఆస్తిని ప్రస్తుతం ఆయన ముగ్గురు పిల్లలు ప్రిన్స్, పారిస్ మరియు బిగి (బ్లాంకెట్) అనుభవిస్తున్నారు. జాక్సన్ తన వీలునామాలో ఆస్తుల పంపకంపై చాలా స్పష్టమైన ప్లాన్ రూపొందించాడు. తన ఆస్తిలో ఎక్కువ భాగం తన పిల్లలకు చెందేలా, అలాగే తన తల్లి కేథరిన్ జాక్సన్ జీవితాంతం గౌరవంగా బతికేలా ఏర్పాట్లు చేయడం విశేషం. వీటితో పాటు కొంత భాగాన్ని చారిటీ సంస్థలకు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది.

ఇక ఏప్రిల్ 14, 2026 నాటి ఈ గణాంకాలను బట్టి చూస్తే, మైఖేల్ జాక్సన్ కేవలం బతికున్నప్పుడే కాదు, మరణించిన తర్వాత కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సెలబ్రిటీగా తన సామ్రాజ్యాన్ని ఏలుతున్నారని చెప్పక తప్పదు.

మైఖేల్ జాక్సన్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఆయన మరణించినా, తన మ్యూజిక్ ద్వారా ఇప్పటికీ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ, సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.