
📌 Key Points
- అఖండ 2 టికెట్ల పెంపు జీవోను హైకోర్టు రద్దు చేసింది.
- ఇకపై సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
- హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్లపై మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నలు సంధించారు.
- అఖండ 2 టికెట్ల పెంపు తనకు తెలియకుండా పొరపాటున జరిగిందని మంత్రి వెల్లడి.
హైకోర్టు అఖండ 2 టికెట్ల పెంపు జీవోను రద్దు చేసిన నేపథ్యంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదని స్పష్టం చేశారు. హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్లను ప్రశ్నించిన ఆయన, తమ ప్రభుత్వం పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు.
అఖండ 2 టికెట్ల పెంపు రద్దు, కోర్టు సీరియస్
Minister Komatireddy: అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని స్పష్టం చేశారు. నిర్మాతలు, దర్శకులెవరూ టికెట్ల రేట్లు పెంచమని తమ దగ్గరకు రావొద్దన్నారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలన్నారు. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామన్నారు. ఈసారి పొరపాటు జరిగిందని చెప్పుకొచ్చారు.
అఖండ2 సినిమా టికెట్ ధరల పెంపు నాకు తెలియకుండా జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.ఇకముందు ఎలాంటి సినిమాలకు టికెట్ ధరలు పెంచేది లేదన్నారు. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు తనకు తెలియకుండా పొరపాటున టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారన్నారు. తాను గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో బిజీగా ఉన్నానని, ఈసారి తన శాఖ అధికారులు పొరపాటున పెంచేశారన్నారు. సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చూసేది, ఇష్టమున్నట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా? ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ వ్యక్తులు ఎవరూ టికెట్ ధరలు పెంచమని తనను అడగకండని సూచించారు.
ఇకపై టికెట్ల రేట్ల పెంపు ఉండదు: మంత్రి కోమటిరెడ్డి
హీరోల రెమ్యునరేషన్లపై మంత్రి ప్రశ్నలు
తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు మరోసారి వివాదాస్పదం అయింది. హీరో బాలకృష్ణ నటించిన అఖండ2 సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఓ న్యాయవాది కోర్టుకెక్కారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. రేట్ల పెంపు జీవోను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో స్పందిస్తూ ఇకపై సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటనతో, తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ఇకపై తావుండదని స్పష్టమైంది. పేదల ఆసక్తి, వారి ఆర్థిక స్థోమతను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమకు ఇది కొత్త దిశానిర్దేశం.


