|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mirai Movie: మిరాయ్‌ చిత్రంలో మహేశ్ బాబు.. తేజా సజ్జా క్లారిటీ!

Published: 01-09-2025, 10:15 AM
Mirai Movie: మిరాయ్‌ చిత్రంలో మహేశ్ బాబు.. తేజా సజ్జా క్లారిటీ!

హనుమాన్ తర్వాత తేజా సజ్జా నటించిన మిరాయ్ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ట్రైలర్‌లోని రాముడి పాత్రపై చర్చ జరుగుతోంది. మహేశ్ బాబు నటించారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.

Key Points

1

హనుమాన్ సినిమా తర్వాత తేజా సజ్జా నటించిన మిరాయ్ చిత్రం ట్రైలర్ విడుదలైంది.

2

ట్రైలర్‌లోని రాముడి పాత్ర ఎవరు చేశారనేది చర్చనీయాంశమైంది.

4

మిరాయ్ చిత్రంలో రాముడి పాత్ర రహస్యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

మిరాయ్ ట్రైలర్ విడుదల

హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ ‌ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజా సజ్జా . ప్రశాంత్ ‌ వర్మ డైరెక్షన్ ‌ లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ ‌ బస్టర్ ‌ గా నిలిచింది . ప్రస్తుతం తేజా సజ్జా మరో విజువల్ ‌ వండర్ ‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు . తేజా సజ్జా లీడ్ ‌ రోల్లో నటించిన తాజా చిత్రం మిరాయ్ . ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ ‌ కాగా .. విజువల్స్ ‌ కు ఆడియన్స్ ‌ ఫిదా అవుతున్నారు . మరో బ్లాక్ ‌ బస్టర్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు .

రాముడి పాత్రపై చర్చ

అయితే ఈ ట్రైలర్ ‌ లో చివర్లో రాముడి పాత్రను చూపించారు . ఆ రోల్ ‌ చేసింది ఎవరనేదానిపై టాలీవుడ్ ‌ లో చర్చ మొదలైంది . రాముడి పాత్రలో ఉన్నది ప్రిన్స్ ‌ మహేశ్‌బాబు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సీన్ ‌ లో ఉన్నది ఎవవనేది మాత్రం చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు .

తేజా సజ్జా క్లారిటీ

ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న తేజ సజ్జాకు దీనిపై ప్రశ్న ఎదురైంది . రాముడి పాత్రలో ఉ ‍ న్నది మహేశ్ ‌ బాబేనా అని అడిగారు . దానికి ఆయన కాదని తేజ సజ్జా సమాధానమిచ్చాడు . దీంతో రూమర్స్ ‌ కు చెక్ ‍ పడింది . కాగా .. రాముడి పాత్రలో స్టార్‌ హీరో ఉన్నారని .. ఏఐ సాయంతో ఆ క్యారెక్టర్‌ రూపొందించారని మొదట రూమర్లు వినిపించాయి. మరి రాముడి పాత్రలో ఉన్నది ఎవరో తెలియాలంటే మాత్రం థియేటర్లలో చూడాల్సిందే . కాగా .. ఈ సినిమాకు కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు . టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్ర్లో మెప్పించనున్నారు .

చివరగా, మిరాయ్ చిత్రంలోని రాముడి పాత్ర రహస్యం ఇంకా కొనసాగుతోంది. సినిమా విడుదల తర్వాతే నిజం తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.