|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mirai Teaser: సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ‘మిరాయ్’.. టీజర్ రిలీజ్

Published: 28-05-2025, 1:46 AM
Mirai Teaser: సూపర్ హీరో కాన్సెప్ట్‌తో 'మిరాయ్'.. టీజర్ రిలీజ్

‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జా మరో సూపర్ హీరో సినిమా ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ అంచనాలను పెంచింది. పవర్‌ఫుల్ విలన్ గా మంచు మనోజ్ కనిపించడం విశేషం.

Key Points

1

తేజ సజ్జా 'మిరాయ్' సూపర్ హీరో సినిమా టీజర్ విడుదలైంది.

2

పవర్‌ఫుల్ విలన్‌గా మంచు మనోజ్ నటన ఆకట్టుకుంటుంది.

4

సెప్టెంబరు 5న ఏడు భాషల్లో సినిమా విడుదల.

‘మిరాయ్’ టీజర్ హైలైట్స్

‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మరోసారి సూపర్ హీరోగా అలరించేందుకు సిద్ధమైపోయాడు. ‘మిరాయ్’ మూవీతో రాబోతున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.

తేజ సజ్జా, మంచు మనోజ్ కలయిక

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’లో పవర్‌ఫుల్ విలన్‌గా మంచు మనోజ్ కనిపించబోతున్నాడు. టీజర్ అయితే బందోబస్తుగా ఉంది. ప్రభాస్ ‘కల్కి’ తరహాలో త్రేతా యుగం, కలియుగం మధ్య ఏదో లింక్ ఉన్నట్లు చూపించారు. విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. అలానే లొకేషన్స్ కూడా అదిరిపోయాయి.

రిలీజ్ డేట్ ప్రకటన

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‪‌తో నిర్మించింది. తొలుత అనుకున్నట్లు ఆగస్టు 1న కాకుండా సెప్టెంబరు 5న ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి తేజ సజ్జా ఈసారి హిట్ కొడితే.. పాన్ ఇండియా వైడ్ హీరోగా సెటిలైపోవచ్చు. విలన్‌గా మనోజ్ కూడా అంచనాలు పెంచేలా కనిపించాడు. చివర్లో రాముడి ఎంట్రీ ఉందన్నట్లు చూపించి ఆసక్తి పెంచారనే చెప్పొచ్చు.

తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా భారీ అంచనాలను సృష్టిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.