|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Miraj Cinemas: హైద‌రాబాద్ న‌గ‌రానికి సినిమాలే ఊపిరి: దిల్ రాజు

Published: 25-09-2025, 12:14 PM
Miraj Cinemas: హైద‌రాబాద్ న‌గ‌రానికి సినిమాలే ఊపిరి: దిల్ రాజు

హైదరాబాద్ లోని నార్సింగిలో మరో కొత్త వినోద కేంద్రం మిరాజ్ సినిమాస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. నాలుగు డాల్బీ డిజిటల్ స్క్రీన్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ మాల్, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందిస్తుంది.

Key Points

1

నార్సింగిలో మిరాజ్ సినిమాస్ గ్రాండ్ గా ప్రారంభం.

2

నాలుగు అత్యాధునిక డాల్బీ డిజిటల్ స్క్రీన్లు.

4

గ్రౌండ్ ఫ్లోర్ లో డీమార్ట్ ఉన్న మాల్.

మిరాజ్ సినిమాస్ గ్రాండ్ ప్రారంభం

భాగ్యగరంలో కొత్తగా వినోదం పంచేందుకు మరో మాల్ ‌ ప్రారంభమైంది . తాజాగా నార్సింగి ప్రాంతంలో మిరాజ్ సినిమాస్, ఆనంద్ మాల్ అండ్ మూవీస్ ‌ ను ఇవాళ గ్రాండ్ ‌ గా లాంఛ్ చేశారు. ఈ కొత్త మాల్ ‌ లో నాలుగు అత్యాధునిక డాల్బీ డిజిట‌ల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఛైర్మ‌న్ రామేశ్వ‌ర‌రావు, సినీ నిర్మాత దిల్ రాజు, ప్ర‌ముఖ‌ న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆర్. నారాయ‌ణ‌మూర్తి, ర‌ఘురామ్ గ్రూప్ ఎండీ డాక్ట‌ర్ అనంద‌రావు, మిరాజ్ సినిమాస్ ఎండీ భువ‌నేశ్ పాల్గొన్నారు .

అత్యాధునిక సదుపాయాలు

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు .’ హైద‌రాబాద్ న‌గ‌రానికి సినిమాలే ఊపిరి. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా నివ‌సించే ప్రాంతాల‌కు ద‌గ్గ‌ర్లో ప్రీమియం థియేట‌ర్లు రావ‌డం ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే. ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా కుటుంబ అవ‌స‌రాలు, వినోదం రెండింటినీ నార్సింగిలోని ఈ మిరాజ్ సినిమాస్ తీరుస్తుంది” అని అన్నారు . ద‌ర్శ‌క నిర్మాత‌ ఆర్. నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ ..’ వినోదం అంటే కేవ‌లం సినిమా మాత్ర‌మే కాదు. అన్ని ఆనందాలూ పంచుకోవ‌డం. ఈ మ‌ల్టీప్లెక్స్ వ‌ల్ల అంత‌ర్జాతీయ స్థాయి టెక్నాల‌జీ, కంఫ‌ర్ట్ రెండూ ల‌భిస్తాయి. నార్సింగి ప్రాంత వాసుల‌కు ఇది క‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని విశ్వ‌సిస్తున్నా” అని అ ‍ న్నారు .

నార్సింగి ప్రజలకు వినోదం

కాగా .. ఈ థియేటర్లలో 801 సీట్ల సామ‌ర్థ్యంతో ఉండనున్నాయి. మిరాజ్ సినిమాస్ ప్రేక్షకులకు అంత‌ర్జాతీయ స్థాయి సినీ అనుభ‌వాన్ని అందించనుంది. అంతేకాకుండా ఈ మాల్‌లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డీమార్ట్ ఉండనుంది. ఈ మాల్‌ ఓఆర్ఆర్‌కు కేవలం కిలోమీటర్‌ దూరంలో ఉంది.

మిరాజ్ సినిమాస్, నార్సింగి ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమా అనుభవాన్ని అందిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ మాల్ ప్రజలకు వినోదంతో పాటు ఇతర అవసరాలను తీరుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.