
📌 Key Points
- పెట్రోల్ ధరలు ₹500కి చేరుతాయనే పుకార్లతో హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు.
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పెట్రోల్ కోసం ప్రజలు బారులు తీరిన దృశ్యాలు.
- పెట్రోల్ ధరల పెరుగుదలపై వస్తున్న వార్తలు అవాస్తవమని అధికారులు ప్రకటన.
- పుకార్లను నమ్మి ప్రజలు పెట్రోల్ బంకుల వద్దకు రావడంతో రద్దీ ఏర్పడిందని అభిప్రాయాలు.
ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయని, లీటర్ రూ.500 పలుకుతుందని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కట్టారు.
పెట్రోల్ ధరల పెరుగుదల పుకార్లు
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అరబ్ కంట్రీస్ నుంచి భారత్‌కు రావాల్సిన క్రూడ్ ఆయిల్ షిప్పులు ఆగిపోయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకులు మూతపడతాయని, లీటర్ పెట్రోల్ ధర ఏకంగా ₹500 కి చేరుకుంటుందని హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో సోషల్ మీడియా పుకార్లను వ్యాప్తి చేశారు. దీంతో ఆ వార్తలను నమ్మిన యువత పెద్ద ఎత్తున బంకుల వద్దకు చేరుకొని ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పెద్ద ఎత్తున యువకులు బైకులు, బాటిళ్లలో పెట్రోల్ కోసం క్యూ కట్టడం స్పష్టంగా కనిపించింది.
హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ
అయితే పెట్రోల్ రేట్ల పెంపుపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతాయనే సాకుతో కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని. ఈ పుకార్లను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకోవడంతో అనవసరమైన రద్దీ ఏర్పడి సామాన్య వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పలువురు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల ప్రకటన: పుకార్లు నమ్మవద్దు
ఇదిలా ఉంటే ప్రభుత్వ వర్గాలు, అధికారిక చమురు సంస్థలు పెట్రోల్ సరఫరా నిలిపివేత పై ఎటువంటి ప్రకటన చేయలేదని ప్రజలు గమనించాలి. ఇటువంటి అశాస్త్రీయమైన వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని, ఏదైనా సమాచారం ఉంటే అధికారిక వార్తా సంస్థల ద్వారా ధృవీకరించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అనవసరంగా భయాందోళనలకు గురై పెట్రోల్ నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి సంయమనం పాటించాలని విశ్లేషకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనవసరంగా పెట్రోల్ నిల్వ చేయడం వల్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది.


