
తెలుగు సినిమా పరిశ్రమలో త్వరలో విడుదల కాబోతున్న ‘మిరాయ్’ సినిమాకు సంబంధించి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అశోకుని తొమ్మిది గ్రంథాల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
Key Points
మిరాయ్ సినిమా ఐడియా ఏడేళ్ల క్రితం వచ్చింది.
అశోకుని తొమ్మిది గ్రంథాల చుట్టూ తిరిగే కథాంశం.
యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రియల్ లోకేషన్స్‌ని ఉపయోగించారు.
ఏ సీనియర్ నటుడికీ కార్వాన్ లేకుండా షూటింగ్ జరిగింది.
మిరాయ్ సినిమా ఐడియా మరియు కథాంశం
టాలీవుడ్ సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ సినిమా’మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు.
సెప్టెంబర్ 12న మిరాయ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విలేకరులు సమావేశంలో మిరాయ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
-ఏడేళ్ల క్రితమే ఈ ఐడియా పుట్టింది. ఈ ఆలోచనకి ఇతిహాసాలని ఎలా ముడి పెట్టొచ్చనే ప్రాసెస్‌కి చాలా టైం పట్టింది. చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాలను గురించి విన్న కథలు, పాషనేటింగ్ ఎలిమెంట్స్‌తో మిరాయ్‌ని డెవలప్ చేయడం జరిగింది.
షూటింగ్ విశేషాలు మరియు లోకేషన్స్
-ఇది మన రూటేడ్ కథలా ఉంటుంది. ఆడియన్స్ అందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. ఆడియన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అశోకుని వద్ద తొమ్మిది గ్రంథాలు ఉన్నాయానే ఒక మిత్ ఉంది. ఆ తొమ్మిది పుస్తకాలు దుష్టుల బారిన పడితే, వాటిని మన ఇతిహాసాలు ఆధారంగా ఎలా కాపాడవచ్చనేది మిరాయ్ ఐడియా.
-ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఇతిహాసాల్లో పురాణాల్లో ఉందనే నమ్మకంతో చేసిన కథ. ఈ కథని యాక్షన్ అడ్వెంచర్ గా ట్రీట్ చేశాం. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్. ఈ కథ దాదాపు ప్రజెంట్‌లోనే జరుగుతుంది.
-ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు యాంబిషన్ పెద్దదని తెలుసు. ఈ సినిమా చేసిన ప్రాసెస్ డిఫరెంట్. నటీనటులందరినీ రియల్ లోకేషన్స్‌లోకి తీసుకెళ్లాం. మంచు పర్వతాల్లో, ఎడారుల్లో, అడవుల్లో .. అన్నింట్లో రియల్‌గా చేశాం.
యాక్షన్ సన్నివేశాలు మరియు నటీనటుల కృషి
-మొత్తం షూటింగ్‌లో ఒక్క సీనియర్ యాక్టర్‌కి కూడా కార్వాన్ లేదు. వారి సపోర్ట్ వలన ఈ సినిమాకి అంత అద్భుతంగా కుదిరింది. శ్రీలంక, నేపాల్, రాజస్థాన్, బుర్జు, థాయిలాండ్.. మొత్తం ఏసియా అంతా తిరిగేశాం.
-మిరాయ్ సినిమాలో ఆరేడు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. ఇందులో ఫాస్ట్ యాక్షన్‌ని ట్రై చేశాం. తేజ ఈ సినిమా కోసం థాయిలాండ్‌లో ప్రత్యేకం శిక్షణ తీసుకున్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు.
-లేదండి. రెండు కథలు వేరు. మిరాయ్ సినిమాను ఎంత అద్భుతంగా తీయాలనేది మాత్రమే అలోచించాను.
మొత్తంమీద, మిరాయ్ సినిమా షూటింగ్ అనుభవం చాలా వినూత్నంగా ఉందని, నటులు, సిబ్బంది అందరూ కలిసి కష్టపడి పనిచేశారని డైరెక్టర్ తెలిపారు.


