
📌 Key Points
- మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ కానుంది, అభిమానులకు పండగే!
- పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ నటనతో మీర్జాపూర్ సినిమా అదిరిపోనుంది.
- గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో, పునీత్ కృష్ణ కథతో చిత్రం రాబోతుంది.
- ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై త్వరలో విడుదల తేదీ ప్రకటన!
క్రైమ్ థ్రిల్లర్ మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి రాబోతుంది. ఓటీటీలో ఒక ఊపు ఊపిన ఈ సిరీస్ ఇప్పుడు సినిమాగా విడుదల కానుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీర్జాపూర్ సినిమాగా వస్తుందోచ్!
Mirzapur The Film: మీర్జాపూర్.. ఈ వెబ్ సిరీస్ గురించి అసలు పరిచయమే అవసరం లేదు. యాక్షన్ అండ్ క్రైం థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించింది. కొరోనా టైంలో విడుదలైన ఈ సిరీస్ ఓటీటీ రికార్డ్స్ ను షేక్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సమయంలో యూత్ అంతా ఈ సిరీస్ గురించే చర్చించుకున్నారు అంటే ఆ సిరీస్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా ఆ సిరీస్ సక్సెస్ కావడంతో రెండు సీక్వెల్స్ ను చేశారు మేకర్స్. మీర్జాపూర్ సీజన్ 2, మీర్జాపూర్ సీజన్ 3. ఈ రెండు సీజన్స్ కూడా ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ ను థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మీర్జాపూర్: ది ఫిలిం(Mirzapur The Film) అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ లతో యాక్షన్ ట్రీట్!
అయితే, మీర్జాపూర్ క్రైం థ్రిల్లర్ సాగాను ఆడియన్స్ అందరికి అందించేలా ఈ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అందుకే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. ఇక వెబ్ సిరీస్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో కంటెంట్ ఉండనుందట. ఇక ఈ సిరీస్ తో పాపులర్ అయిన పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలుగా కనిపిస్తారట. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పునీత్ కృష్ణ కథను అందిస్తున్నాడు.
త్వరలో విడుదల తేదీ ప్రకటన!
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా విడుదల డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మీర్జాపూర్ థియేటర్స్ లో ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
మీర్జాపూర్ సినిమా థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని చూస్తూ ఉండండి.


